తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ రెండవ వారంలో..!
ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగింపు..! దశకు చేరుకుంది

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 2026 వార్షిక పరీక్షల ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డ్ (TGBIE) సర్వం సిద్ధం చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ మధ్య ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.ఈ ఏడాది దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు (ఫస్టియర్ & సెకండియర్) పరీక్షలకు హాజరయ్యారు.
ఎక్కడ చూడాలి?: ఫలితాలు విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చు.



