నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన..!

జువ్వలదిన్నె పోరుబాట.. మత్స్యకారులతో ముఖాముఖి..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించి, మత్స్యకారుల సమస్యలపై గళమెత్తనున్నారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ జగన్ ఈ పర్యటన చేపట్టారు.

హార్బర్ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి, వారి జీవనోపాధిపై ప్రైవేటీకరణ చూపించే ప్రభావాన్ని అడిగి తెలుసుకోనున్నారు.

వేట నిషేధ కాలంలో అందజేసే ‘మత్స్యకార భరోసా’ మరియు ఇతర సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.

ఇదే సమయంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా నెల్లూరు జిల్లాలోనే పర్యటిస్తుండటంతో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాలకు చెందిన కొంతమంది మత్స్యకారులు జగన్ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో పర్యటన ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button