పైప్‌లైన్ లోపం అంగీకరించిన ఇంజనీర్లు..!
ఇంజనీర్లతో మాట్లాడగా, పైప్‌లైన్ కుంగిన విషయం వాస్తవమేనని, ఒకేసారి నీటి ఒత్తిడి రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇది తమవైపు జరిగిన లోపమేనని అంగీకరించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం దెబ్బతిన్న భాగాలను సరిచేసే పనులు కొనసాగుతున్నాయని ఇంజనీర్లు వివరించినట్లు నాయకులు తెలిపారు.

నిజం చెప్తాం కథనంతో కదిలిన అధికారులు
మేళ్లచెరువు, ఆగస్టు 6 (నిజం చెప్తాం):
మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనుల్లో లోపాలపై ‘నిజం చెప్తాం’ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రభావం చూపింది.
కథనం నేపథ్యంలో మేళ్లచెరువు మండల వైస్ సర్పంచ్ పసుపులేటి నాగమణి నాగేశ్వరరావు, 1వ వార్డు సభ్యుడు ఇరిగెల సైదిరెడ్డి, వెల్లటూరు సర్పంచ్ సత్యనారాయణ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుడు హరి లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పైప్‌లైన్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇంజనీర్లతో మాట్లాడగా, పైప్‌లైన్ కుంగిన విషయం వాస్తవమేనని, ఒకేసారి నీటి ఒత్తిడి రావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇది తమవైపు జరిగిన లోపమేనని అంగీకరించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం దెబ్బతిన్న భాగాలను సరిచేసే పనులు కొనసాగుతున్నాయని ఇంజనీర్లు వివరించినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి స్వయంగా ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను పరిశీలించి, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించాలని కోరారు. అలాగే పనుల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మేళ్లచెరువు, వెల్లటూరు గ్రామాలకు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రైతుల భూములకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు సక్రమంగా అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అదేవిధంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ, రైతుల ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తున్న ‘నిజం చెప్తాం’ దినపత్రిక యాజమాన్యానికి, సంబంధిత విలేకరికి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.



