“బతకాలని అనుకున్నా.. బ్లూ డ్రమ్ భయంతో భార్యకు మరో పెళ్లి చేసిన భర్త.. వైరల్ కామెంట్స్!”

నేను బతకాలని అనుకున్నాను. డ్రమ్ములో బందీగా ఉండిపోవాలనుకోలేదు. నా మంచి కోసమే ఆమెకు మరో పెళ్లి చేశాను. మాకు లవ్ మ్యారేజ్ జరిగి 21 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ నా భార్య నన్ను, పిల్లలను వదిలి వేరొకరితో ప్రేమలో పడింది. ఆమె నాతో సంతోషంగా లేనప్పుడు, ఆమె ఆనందంలోనే నా ఆనందం ఉంది. అందుకే ఎలాంటి గొడవలు లేకుండా ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాను" అని తెలిపాడు.

నిజం న్యూస్ | ఆగస్టు 6, 2026

ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన భార్యకు ఆమె ప్రియుడితో భర్తే స్వయంగా వివాహం జరిపించడంతో పాటు, ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

భర్త మాట్లాడుతూ, “నేను బతకాలని అనుకున్నాను. డ్రమ్ములో బందీగా ఉండిపోవాలనుకోలేదు. నా మంచి కోసమే ఆమెకు మరో పెళ్లి చేశాను. మాకు లవ్ మ్యారేజ్ జరిగి 21 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ నా భార్య నన్ను, పిల్లలను వదిలి వేరొకరితో ప్రేమలో పడింది. ఆమె నాతో సంతోషంగా లేనప్పుడు, ఆమె ఆనందంలోనే నా ఆనందం ఉంది. అందుకే ఎలాంటి గొడవలు లేకుండా ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించాను” అని తెలిపాడు.

 

అతని వివరాల ప్రకారం, ఇటీవల భార్య మొబైల్‌లో తన ఫొటోతో పాటు “సిమెంట్”, “బ్లూ డ్రమ్”కు సంబంధించిన పోస్టులు కనిపించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులను గుర్తు చేసుకుని, తనకు కూడా అలాంటి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని భావించినట్లు చెప్పాడు. దీంతో వివాదాలు, గొడవలకు వెళ్లకుండా భార్య నిర్ణయాన్ని అంగీకరించి ఆమెకు ప్రియుడితో పెళ్లి జరిపించినట్లు వెల్లడించాడు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, భర్త వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు కుటుంబ వ్యవస్థ, దాంపత్య బంధాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

– శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button