భార్యను చంపడం ఎలా” అని గూగుల్‌లో వెతికి హత్య
భార్య లావుగా మారిందని తరచూ జంక్ ఫుడ్, మాంసాహారం తెమ్మని ఒత్తిడి చేస్తుందని పైగా తనను అనుమానిస్తుందని కక్ష పెంచుకుని ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న కిరణ్ కుమార్

భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం పెట్టి చంపిన భర్త
వైఎస్సార్ కడప జిల్లా మద్దునూరులోని కొత్తకొట్టాలకు చెందిన పద్మజ(31)ని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఇల్లరికం అల్లుడిగా వెళ్ళిన ప్రొద్దుటూరుకు చెందిన భద్రపల్లి కిరణ్ కుమార్.. వీరికి ఒక పాప
ఇటీవల భార్య లావుగా మారిందని తరచూ జంక్ ఫుడ్, మాంసాహారం తెమ్మని ఒత్తిడి చేస్తుందని పైగా తనను అనుమానిస్తుందని కక్ష పెంచుకుని ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్న కిరణ్ కుమార్
గూగుల్‌లో భార్యను చంపడం ఎలా అని వెతికి వచ్చిన వీడియోల్లో ఉన్న ఒక నంబర్‌కు ఫోన్ చేసి విషం తెప్పించుకుని, గత నెల 29వ తేదీన పాలకోవాలో కలిపి ఇచ్చిన నిందితుడు
కాసేపటికి భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లాక, ఊపిరాడకుండా చేసి హతమార్చి రెండు మూడు గంటలు మృతదేహంతోనే గడిపిన కిరణ్
భార్య మృతిని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, పోస్ట్ మార్టంలో బయటపడిన ఆధారాలతో నిందితుడిని విచారించి అరెస్ట్ చేసిన పోలీసులు



