మెయింటినెన్స్ ఏజెన్సీ ఏర్పాటు లో ఆర్ అండ్ బి నిర్లక్ష్యం.

కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని 353 సి జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన మేడిపల్లి టోల్ ప్లాజా, టెండర్ విషయం అంటేనే ఏజెన్సీలు భయప్రాంతానికి గురై అబ్బో మేము రాము ఆ ప్లాజాకు అనే దుస్థితికి తీసుకురావడం జరిగింది ఆ ప్రధాన మూడు శాఖలు,

రాష్ట్రంలోని 32 ప్లాజాలకు మెయింటెనెన్స్ మరియు టోల్ కలెక్షన్, కొరకు థర్డ్ పార్టీ ఏజెన్సీలు పెద్ద సంఖ్యలో టెండర్ దాఖలు చేయడం జరుగుతుంది. అనేక ఏజెన్సీలు టోల్ ప్లాజా మెయింటెనెన్స్ మరియు కలెక్షన్ అంటే, ఒక అడుగు ముందుకు వేసి, టెండర్ రేట్ కన్నా తక్కువగా డీడ్ దాఖలు చేసి, ప్లాజా టెండర్ దక్కించుకోవాలని శతకోటి ప్రయత్నాలు చేస్తారు. కానీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని 353 సి జాతీయ రహదారి పై ఏర్పాటు చేసిన మేడిపల్లి టోల్ ప్లాజా, టెండర్ విషయం అంటేనే ఏజెన్సీలు భయప్రాంతానికి గురై అబ్బో మేము రాము ఆ ప్లాజాకు అనే దుస్థితికి తీసుకురావడం జరిగింది ఆ ప్రధాన మూడు శాఖలు,

మేడిపల్లి టోల్ ప్లాజా “ఈ పి సి” ప్రాజెక్ట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో మూడు శాఖల పర్యవేక్షణ తో పాటు, రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీ లు మెయింటెనెన్స్ మరియు టోల్ వసూలు చేయడం జరుగుతుంది. కానీ గతంలో, మెయింటినెన్స్ కొరకు ఏర్పాటుచేసిన ఏజెన్సీ, ఏలాంటి మెయింటినెన్స్ చేసి వెళ్లిపోయిందో, ఆర్ అండ్ బి శాఖ తోపాటు,మోర్ధ్,ఎన్ హెచ్ ఏ ఐ, శాఖ మరియు అధికారులకే తెలుసు.

మేడిపల్లి టోల్ ప్లాజా వ్యవహారం పై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా,మోర్ధ్, అలాగే ఎన్ హెచ్ ఏ ఐ, తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్ అండ్ బి శాఖ, నిర్లక్ష్య ధోరణి, జాతీయ హైవే 353 సి తోపాటు టోల్ ప్లాజా మెయింటినెన్స్ కొరకు ఏజెన్సీల నిరాకరణ ఒక దౌర్భాగ్యకరమైన దుస్థితికి తీసుకువచ్చింది ఆర్ అండ్ బి శాఖ. భారత దేశంలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ పరిధిలోని టోల్ ప్లాజాల తీరు,

టూల్ నిర్వహణ విషయంలో, రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు నియమించడం జరుగుతుంది ఒకటి ఇన్ హెచ్ ఏ ఐ టోల్ కలెక్షన్ కొరకు ఏజెన్సీ నియమిస్తే, టోల్ ప్లాజా మెయింటినెన్స్ తో పాటు, హైవే మెయిన్టెనెన్స్ కు ఆర్ అండ్ బి శాఖ, థర్డ్ పార్టీ ఏజెన్సీను నియమించాల్సి ఉంటుంది. గతంలో ఆర్ అండ్ బి శాఖ, అనుష్క ఏజెన్సీ కు టోల్ ప్లాజా మెయింటెనెన్స్, రోడ్డు మరమ్మత్తు కొరకు నియమించడం జరిగింది కానీ అనుష్క ఏజెన్సీ, తమ కాంట్రాక్ట్ సమయంలో, బాధ్యత రహితంగా వ్యవహరించకుండా, కాలయాపన చేసి కాంట్రాక్ట్ సమయాన్ని వృధా చేసి, సొమ్ము చేసుకుని వెళ్లిపోవడం జరిగింది.

మెయింటెనెన్స్ పేరుతో జేబులు నింపుకొని వెళ్లిపోయి సంవత్సరకాలం పూర్తి అవుతుంది. కానీ ఆర్ అండ్ బి శాఖ కొత్త ఏజెన్సీ కు నియమించి టోల్ ప్లాజా తో పాటు, రోడ్డు మెయిన్టెనెన్స్ కొరకు ఏజెన్సీను నియమించాల్సి ఉంది. కానీ ఆర్ అండ్ బి మాత్రం, తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తుందని దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఏన్ హెచ్ ఏ ఐ ఎవరు పోయినా, తమకు ఏమీ సంబంధం లేదు, టూల్ ప్లాజా ఏర్పాటు చేసాం జాతీయ రహదారిగా నామకరణం కూడా చేయడం జరిగింది, తమకు రోడ్డు టోల్ ప్లాజా మెయింటెనెన్స్ ఎలా ఉన్నా పరవాలేదు, టోల్ టాక్స్ మాత్రం కచ్చితంగా, తాము వసూలు చేసుకుంటామని రీతిలో, 18 నెలలుగా ఇలాంటి సదుపాయం లేకున్నా టోల్ వసూలు మాత్రం కొనసాగించడం జరుగుతుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button