వడదెబ్బతో కూలి మృతి.
జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో బుడదెబ్బతో మునిగాల చందర్ (40) మృతి చెందడం జరిగింది. శుక్రవారం రోజు చందర్ ఉదయం

వడదెబ్బతో కూలి మృతి.
మొగుళ్ళపల్లి, భూపాలపల్లి మె1, (నిజం న్యూస్)
జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో బుడదెబ్బతో మునిగాల చందర్ (40) మృతి చెందడం జరిగింది. శుక్రవారం రోజు చందర్ ఉదయం మొక్కజొన్న పనులకు వెళ్లి, తీవ్ర ఎండలో తిరిగి ఇంటికి చేరాడు, అనంతరం స్నానం చేసి విశ్రాంతి తీసుకుంటూ నిద్రలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా వడదెబ్బకు గురై మృతి చెందినట్లు చెప్తున్నారు కుటుంబ సభ్యులు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి ప్రధాన ఆసరాగా ఉన్న చందర్ అకస్మిక మృతి చెందడంతో కుటుంబం పెద్దది కోల్పోయింది. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు, ఉదయం అందరితో కలిసి మెలిసి పనులకు వెళ్లిన చందర్ మధ్యాహ్నానికి మృతి ఒడిలో వెళ్లడంతో గ్రామమంతా శోక సముద్రంలో మునిగింది, కుటుంబాన్ని ఆత్మస్థైర్యం అందించుటకు స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు పెద్ద మొత్తంలో చందర్ ఇంటికి చేరి, భార్య మరియు పిల్లలను ఓదార్పు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మృతునికి నివాళులు అర్పించారు.



