ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన బొలెరో.
ఇద్దరు ఫారెస్ట్ అధికారులకు తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం, ఎంజీఎం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. పలిమెల మండలం,లెంకలగడ్డ లో, ఘటన. రోడ్డు ప్రమాదం పై పలు అనుమానాలు.!

ఇద్దరు ఫారెస్ట్ అధికారులకు తీవ్ర గాయాలు.
ఒకరి పరిస్థితి విషమం, ఎంజీఎం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
పలిమెల మండలం,లెంకలగడ్డ లో, ఘటన.
- రోడ్డు ప్రమాదం పై పలు అనుమానాలు.!
పలిమెల, భూపాలపల్లి: ఏప్రిల్ 30 (నిజం న్యూస్)
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు అటవీ శాఖ బీట్ అధికారులకు బొలెరో వాహనం ఢీకొట్టడంతో, చంద్రశేఖర్ శ్రీకాంత్ అనే ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులు తీవ్ర గాయాల పాలై, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన, గురువారం రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని, పలిమెల మండలంలోని లెంకలగడ్డ వద్ద చోటుచేసుకుంది. ఫారెస్ట్ అధికారుల ద్విచక్ర వాహనానికి బొలెరో వాహనం ఢీకొట్టడం జరిగిన సంఘటన పై పలు విధమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, జయశంకర్ జిల్లా ఉమ్మడి మహాదేవపూర్ మండలంలోని, పలిమెల మండలంలోని
లెంకలగడ్డ గ్రామం వద్ద, పలిమెల అటవీ శాఖకు సంబంధించిన చంద్రశేఖర్ మరియు శ్రీకాంత్ అనే ఇద్దరు బీట్ ఆఫీసర్లు, కొత్తగా బాధ్యతలు తీసుకొని కొన్ని రోజులు మాత్రమే జరుగుతుంది. ఇది క్రమంలో గురువారం రోజు ఇద్దరు బీట్ ఆఫీసర్లు, లెంకలగడ్డ అటవీ ప్రాంతం, ఇన్స్పెక్షన్ కొరకు వెళుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగిందని తెలుస్తుంది. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు బీట్ ఆఫీసర్లకు తలపై తీవ్రంగా గాయాలు కావడంతో, ఒక బీట్ ఆఫీసర్ కు తల తో పాటు ముక్కు భాగం అలాగే చెవుల నుండి రక్తస్రావం కలగడంతో, మెరుగైన చికిత్సకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే మరో బీట్ ఆఫీసర్ కు జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అటవీ శాఖ ఇన్స్పెక్షన్ కు వెళ్తున్న అధికారుల ద్విచక్ర వాహనానికి ఒక బొలెరో వాహనం ఢీకొట్టడం, జరిగిన సంఘటన పై మండల వాసులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నట్లు సమాచారం, అలాగే సమయానికి దేవుని దూతల వచ్చి, బీట్ అధికారులను మెరుగైన చికిత్స కొరకు పలిమెల పోలీస్ శాఖ మానవత్వాన్ని చాటుకుందని అభినందిస్తున్నారు మండల వాసులు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


