అడవిలో దొంగలు
సీసీ కెమెర ను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు.జంతువుల రక్షణ గుర్తింపు,కొరకు ఏర్పాటుచేసిన సీసీ కెమెరా. అపహరించిన సీసీ కెమెరా, విలువ సుమారు 50.వేల పైచిలుకు

అడవిలో దొంగలు,
సీసీ కెమెర ను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు.
జంతువుల రక్షణ గుర్తింపు,కొరకు ఏర్పాటుచేసిన సీసీ కెమెరా.
అపహరించిన సీసీ కెమెరా, విలువ సుమారు 50.వేల పైచిలుకు
పలిమెల మండలంలో ఘటన. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
సీసీ కెమెరా అపహరణ అటవీస్మగులర్లు, జంతువు వేటగాళ్ల పనే. మండల ప్రజలు.
పలిమెల, భూపాలపల్లి: మీ 8( నిజం న్యూస్)
గ్రామాల్లో దొంగతనాలు సహజంగా జరుగుతుంటాయి కానీ అడవిలో దొంగతనం అది కూడా దట్టమైన అడవి, భారీ జంతువులు తిరిగే ప్రదేశంలో దొంగలు తమ చేతి వాటకాన్ని ప్రదర్శించి సీసీ కెమెరా అపహరించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని, మహాదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలోని, పరిమిల రేంజ్ లో ఉన్నటువంటి పెద్దంపేట అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సీసీ కెమెరా అపహరించిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ అయినటువంటి పలిమెల మండలంలో, పులుల రక్షణ తో పాటు వాటిని గుర్తించుటకు, అలాగే ఇతర జంతువులు గుర్తించడంతోపాటు అడవుల రక్షణ కొరకు గత సంవత్సరం, 20 ప్రధాన లొకేషన్ లను గుర్తించి, మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో 40 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సీసీ కెమెరా విలువ సుమారు 50వేల నుండి 75 వేల వరకు ఉంటుంది. 20 లొకేషన్ లలో పెద్దంపేట దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ గా గుర్తించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం జరిగింది. సీసీ కెమెరాలకు సంబంధించి స్ట్రాంగ్ రికార్డ్ రూమ్ లో పెద్దంపేట లొకేషన్ నుండి లైవ్ రికార్డ్ రాకపోవడంతో గమనించిన, సెక్షన్ ఆఫీసర్ తో పాటు బీట్ ఆఫీసర్లు, లొకేషన్ వద్దకు వెళ్లి పరిశీలించగా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లేకపోవడం, సీసీ కెమెరా ఏర్పాటు చేసిన వైర్లు కత్తిరించి ఉండటంతో, గుర్తు తెలియని వ్యక్తులు సీసీ కెమెరాలు అపరించినట్లు గుర్తించిన అధికారులు, పెద్దంపేట గ్రామం మహదేవపూర్ మండలం పరిధిలో రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో, ఫిర్యాదు చేయడం జరిగింది. అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా అపహరణకు గురికావడం, కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దట్టమైన అడవిలో, సీసీ కెమెరా అపహరణ, అటవీ స్మగ్లర్ల పని లేదా, అడవిలో జంతువుల వేటగాళ్ల పని కావచ్చు అని అంటున్నారు స్థానిక ప్రజలు. ఎందుకంటే సాధారణంగా అడవిలో, ఇతరులు ఎవరు పోరని, అటవీ సంరక్షణతో పాటు, జంతువుల కదలిక కొరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ఎవరికి అభ్యంతరం ఉండదని వాటి ద్వారా, ప్రజలకు అటవీ సంపదపై ఆధారపడి ఉన్న, కుటుంబాలకు ఎంతో ఆసరాగా ఉంటుందని, కానీ అలాంటి సీసీ కెమెరాలు అపహరణ కేవలం స్మగ్లర్లు మరియు, మూగ జంతువుల వేటగాళ్ల పనే అని స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు మండల వాసులు.



