అప్రమత్తత, స్వీయ నియంత్రణలే రోడ్డు ప్రమాద నివారణోపాయాలు
ప్రధానంగా అతివేగం,నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం,సెల్ ఫోను ఉపయోగిస్తూనే డ్రైవింగ్ చేయడం,రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయటం,రెడ్ లైట్ వద్ద దూకడం,సరిగా లేదని తెలిసినా కూడా రోడ్డుపై అజాగ్రత్తగా వెళ్లడం,చిరాకు పరాకు మనసుతో రోడ్డెక్కడo లాంటి అంశాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.

నేటి సాంకేతిక యుగంలో, డిజిటల్ వ్యవస్థ కనుసన్నల్లో ప్రపంచమంతా మోకరిల్లింది. మనుషులు చేసే క్రియలల్లో మనోవేగాన్ని మించిన నాణ్యత కొరవడిన భౌతికవేగం జడలు విప్పింది.
అదే క్రమంలోనే, రోడ్డుపై కాలినడకన నడిచినా వాహనాన్ని నడిపినా పరాకు, చిరాకు ఆలోచనల నడుమ రోడ్డు ప్రమాదాలు నేడు కోడై కూస్తున్నవి.
అందుకే నేడు అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంది.ఇక దేశం లోని పలు రాష్ట్రాల్లో తమిళనాడు,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు కూడా అదే వరసన చేరాయి.ఇది ఒక తీవ్రమైన సమస్యగా పరిణమించింది.
ప్రతినిత్యం వందలాదిమంది రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా అతివేగం,నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం,సెల్ ఫోను ఉపయోగిస్తూనే డ్రైవింగ్ చేయడం,రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయటం,రెడ్ లైట్ వద్ద దూకడం,సరిగా లేదని తెలిసినా కూడా రోడ్డుపై అజాగ్రత్తగా వెళ్లడం,చిరాకు పరాకు మనసుతో రోడ్డెక్కడo లాంటి అంశాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.
ఈ సామాజిక సమస్య మిలియన్ల కొద్దీ జీవితాలను ప్రభావితం చేస్తున్నది. అందుకని ప్రభుత్వం మెరుగైన రోడ్డు సదుపాయాలు కల్పించకపోవడంలో విఫలమవడం, సకాలంలో రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయకపోవడం ఒక ఎత్తైతే, వ్యక్తిగా మనం బాధ్యతాయుత ప్రవర్తనతో నడుచుకున్నప్పుడు ఈ రోడ్డు ప్రమాదాల బారి నుండి తప్పించుకోవచ్చు. ట్రాఫిక్ రూల్స్ పై సరియైన అవగాహన,స్వీయ నియంత్రణలే రోడ్డు ప్రమాద నివారణోపాయాలుగా మనం గుర్తించాలి.
ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే మనకు నేర్పే పాఠం ఇదే.ఇక నుండైనా ఈ క్రింద పేర్కొన్నరీతిలో కొన్ని రోడ్డు నియమాలను పాటిస్తూ,పౌరులుగా పదిమందికీ ఈ నియమాలను తెలియపరుద్దాం.
రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం.
మన వందేళ్ళ ఆయుర్దాయానికి మనకు మనంగా ఊపిరి పోసుకుందాం.
రోడ్డు భద్రతా నినాదాలు,నియమాలు:
1.వేగం వద్దు_ ప్రాణం ముద్దు
2.వేగం తగ్గించుకో _ ప్రాణం నిలబెట్టుకో
3.సెల్ఫోన్ వాడొద్దు_ముప్పు తెచ్చుకోవద్దు
4.హెల్మెట్ ధరించు _సుఖంగా ప్రయాణించు
. 5.సురక్షిత ప్రయాణం_ నీ కుటుంబానికే క్షేమం
6.మద్యం సేవించొద్దు_ ప్రమాదపు అంచును తాకొద్దు
7.భద్రతతో నేస్తం! జీవితానికి అభయహస్తం!
8.పాదచారుల నియమం రోడ్డు కుడివైపు ప్రయాణం ఫుట్‌పాత్ పై నడవటం
9.అధికవేగం అత్యంత ప్రమాదానికి సంకేతం
10.ఆకుపచ్చ లైటు నీ క్షేమ ప్రయాణానికి సంకేతం
11.వ్యతిరేక దిశ ప్రయాణం అగమ్యతకు సంకేతం
12.రహదారిలో వాహనాన్ని అడ్డంగా నిలుపకు;రహదారి అనేది నీ స్వంతఅడ్డా కాదు
13.భద్రత ఓ బాధ్యత ప్రశాంతజీవనం నీ హక్కు
14.ట్రాఫిక్ నియమాలు రోడ్డు భద్రతా సందేశాలు
15.నెమ్మదిగా డ్రైవింగ్ చేయటం నాగరికతకు దర్పణం
16. రహదారులు మన సుఖ జీవన మార్గాలు
17. రహదారి నీది నాది మన అందరిదీ
18.పరాకు ఆలోచన చిరాకు ప్రయాణం దురదృష్టకరం
19. రహదారి సూచికలు సురక్షిత ప్రయాణ వీచికలు
20. పాదచారులను గౌరవిద్దాం! సుఖ ప్రయాణానికి మార్గమిద్దాం!!



