శుక్రవారం నుండి సాంకేతిక పనులు ప్రారంభించాలని

కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్.

*సాంకేతిక పరీక్షలకు దశలవారీగా చేపట్టాలి.*

*మెడి గడ్డ వద్ద అదనపు సిబ్బంది, పనులు వేగవంతం*

*సరస్వతి అప్ స్ట్రీమ్ బోర్ హోల్స్ లను ప్రారంభించండి*

  1. *నేటి నుండి సాంకేతిక పనులు ప్రారంభించాలని ఆదేశం
  2. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్.

*మహాదేవపూర్, భూపాలపల్లి: ఏప్రిల్ 29 (నిజం న్యూస్)*

కాలేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ అన్నారం, లక్ష్మి సరస్వతి బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక పరీక్షలను దశలవారీగా నిర్వహించుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అన్నారు ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, గురువారం రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ తో పాటు అన్నారం సరస్వతి బ్యారేజీలను ఆయన సందర్శించారు. ముందుగా మేడిగడ్డ లో కొనసాగుతున్న బోర్ రూల్స్ పనుల పురోగతి పై అధికారులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. మెడిగడ్డ అన్నారం ప్రాజెక్టుల వద్ద అదనపు సిబ్బంది ఏర్పాటుచేసి పనులు వేగవంతం చేయాలని, సిఆర్పిఎఫ్ పోలీసులు ఉపయోగించిన షెడ్లను పరిశీలించి సిబ్బంది ఉండుటకు విద్యుత్ మరియు నీటి సౌకర్యం కల్పించాలని, అన్నారం వద్ద ఇరిగేషన్ కార్యాలయం అదన సిబ్బంది వసతి కొరకు గదులను పరిశీలించారు,అలాగే అన్నారం ప్రాజెక్ట్ ఆఫ్ స్ట్రీమ్ పరిశీలించి బోర్ హోల్స్ పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ప్రాజెక్ట్ సాంకేతిక పరిశీలన పనులు నేటి శుక్రవారం నుండి ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. పరిశీలన పనుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు సెక్రటరీ శ్రీధర్, శిలాపుర గట్టిగా వచ్చి వరకు డ్రిల్లింగ్ పనులు చేపట్టాలని, వివిధ దశల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూ పనుల్లో నాణ్యతను నిర్ధారించాలని అన్నారు శ్రీధర్, అధికారులు పనులను సమగ్రంగా పర్యవేక్షించాలని ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కారులకు స్పష్టం చేశారు కార్యదర్శి శ్రీధర్. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ కుమార్, సీఈ శ్రీనివాస్ గుప్తా,ఈ ఈ తిరుపతిరావు, యాదగిరి తో పాటు తదితర అధికారులు ఉన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button