తిర్మలాపూర్ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం తిర్మలాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ భవన నిర్మాణానికి రూ. 20,00,000 లక్షలు మంజూరయ్యాయి.

పోతంగల్, జూన్7 (నిజం చెపుతాం ) నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం తిర్మలాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ భవన నిర్మాణానికి రూ. 20,00,000 లక్షలు మంజూరయ్యాయి.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. “ఎస్సీ వాడల్లో అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది.
ప్రజలు ఈ నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి” అని పిలుపునిచ్చారు. పంచాయతీ భవనం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, మాజీ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మాజీ ఎంపీపీ గందపు పవన్, మాజీ ఎంపీటీసీ వీరేశం, సర్పంచ్ బోయి సైదవ్వ, ఉపసర్పంచ్ సంజీవ్, ఎమ్మార్వో సందీప్, ఎంపీడీవో చందర్, ఏఈ, కరెంటు సిబ్బంది, ఇరిగేషన్ సిబ్బంది, మాజీ సర్పంచ్ శంకర్, గ్రామ అధ్యక్షుడు పుష్పాల శంకర్, సునీల్, గంటల విట్టల్, దిలీప్, రమేష్ సెట్, శీను, సాయిలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



