విద్యార్థులు ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఈ రోజుల్లో ఎంతో అవసరం

ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఉద్యోగానికి అయినా కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ తప్పనిసరిగా అడుగుతున్నారని తెలిపారు.

కంప్యూటర్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు 

 

– ఆలేరు యువతకు సువర్ణావకాశం

 

ఆలేరు మార్చి 29 (నిజం చెపుతాం)

 

ఆలేరు పట్టణంలోని వెంకట రమణ జూనియర్ కళాశాలలో VR ఎడ్యుకేషన్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆధునిక కంప్యూటర్ శిక్షణ కోర్సులు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం ప్రతి రంగంలోనూ కంప్యూటర్ పరిజ్ఞానం అత్యవసరంగా మారిన నేపథ్యంలో, ఈ శిక్షణ కార్యక్రమం యువతకు మరియు గృహిణులకు మంచి అవకాశంగా నిలుస్తోంది.

ఈ కోర్సులకు విద్యార్థులు, ఉద్యోగాన్వేషులు, గృహిణులు పెద్ద ఎత్తున నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

ఒక్క నెల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిక్షణలో ప్రాథమిక కంప్యూటర్ జ్ఞానం నుంచి అడ్వాన్స్ కోర్సుల వరకు నేర్పించబడుతుంది.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు పటేల్ వంశి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఏ చిన్న ఉద్యోగానికి అయినా కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ తప్పనిసరిగా అడుగుతున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు కంప్యూటర్ నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరమని సూచించారు.

శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్ అందజేయబడుతుందని, ఇది ఉద్యోగ అవకాశాలను పొందడంలో ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

అదనంగా శిక్షణ పొందిన వారికి ప్రత్యేకంగా జాబ్ గైడెన్స్,ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వంటి సహాయాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి నెల కొత్త బ్యాచ్‌లను ప్రారంభిస్తూ, ఆసక్తి గల అభ్యర్థులకు సౌకర్యవంతమైన సమయాల్లో శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు.

కంప్యూటర్‌పై పూర్తి అవగాహన కల్పిస్తూ, భవిష్యత్‌లో మంచి ఉద్యోగాలను సాధించేందుకు ఈ కోర్సులు దోహదపడతాయని వారు తెలిపారు.

ఈ అవకాశాన్ని ఆలేరు పరిసర ప్రాంతాల యువత, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button