రూ.90 వేల లంచం డిమాండ్.. రూ.50 వేలు స్వీకరించిన సబ్ రిజిస్ట్రార్‌పై ఏసీబీ కేసు!
ఫిర్యాదుదారుడి ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 4723/2026కు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ రూ.90 వేలు డిమాండ్ చేసినట్లు పేర్కొంది. అందులో భాగంగా రూ.50 వేల నగదును కమ్మరి నాగేష్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. అనంతరం మిగిలిన రూ.40 వేల కోసం డిమాండ్ చేసినట్లు తెలిపింది.

హైదరాబాద్, సెప్టెంబర్ 8, 2026: నిజం న్యూస్
నారాయణపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అధికారిక పనులు పూర్తి చేసేందుకు రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 లగిశెట్టి వెంకట స్వామిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 4723/2026కు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ రూ.90 వేలు డిమాండ్ చేసినట్లు పేర్కొంది. అందులో భాగంగా రూ.50 వేల నగదును కమ్మరి నాగేష్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. అనంతరం మిగిలిన రూ.40 వేల కోసం డిమాండ్ చేసినట్లు తెలిపింది.
ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకట స్వామితో పాటు ఇంటి భోజనం మెస్ యజమాని కమ్మరి నాగేష్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఇద్దరినీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ తెలిపింది.
ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు పేర్కొన్నారు.
లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



