పోలీసుల మెరుపు తనిఖీలు.. తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్
తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 2 కార్లు, 2 బైక్‌లను సీజ్ చేశారు. అదేవిధంగా 500 లీటర్ల బెల్లంపానకాన్ని ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

మూడు తండాల్లో జల్లెడ.. వాహనాలు, నాటుసారా స్వాధీనం
నిజం న్యూస్ | సెప్టెంబర్ 12:
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి. ఐపీఎస్ ఆదేశాల మేరకు మరిపెడ సీఐ ఎల్. పవన్‌కుమార్ ఆధ్వర్యంలో మరిపెడ సర్కిల్ పోలీసులు తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గుర్రప్ప తండా, లచ్చ తండా, తండా ధర్మారం గ్రామాల్లో అనుమానాస్పద ఇళ్లు, వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 2 కార్లు, 2 బైక్‌లను సీజ్ చేశారు. అదేవిధంగా 500 లీటర్ల బెల్లంపానకాన్ని ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీల అనంతరం గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ తనిఖీల్లో మరిపెడ ఎస్ఐ గండ్రాతి సతీష్, ఎస్ఐ మైబూబీ, సీరోల్ ఎస్ఐ సంతోష్, చిన్నగూడూరు ఎస్ఐ కుశకుమార్, ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డితో పాటు 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో,నిజం న్యూస్



