వెంకీ విడుదలై 22 సంవత్సరాలు అయ్యిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను!
వెంకీ కేవలం ఒక సినిమా కాదు. ప్రియమైన స్నేహితులు, ఆత్మీయులతో కలిసి చేసిన ఒక మరపురాని ఒక ఆనందకరమైన ప్రయాణం. 70 రోజుల షెడ్యూల్లో, సహజమైన రాత్రి వాతావరణాన్ని కోసం మేము 40 రాత్రులు నిరంతరాయంగా చిత్రీకరణ జరిపాము.

వెంకీ విడుదలై 22 సంవత్సరాలు అయ్యిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని డైరెక్టర్ శ్రీను వైట్ల అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
వెంకీ కేవలం ఒక సినిమా కాదు. ప్రియమైన స్నేహితులు, ఆత్మీయులతో కలిసి చేసిన ఒక మరపురాని ఒక ఆనందకరమైన ప్రయాణం. 70 రోజుల షెడ్యూల్లో, సహజమైన రాత్రి వాతావరణాన్ని కోసం మేము 40 రాత్రులు నిరంతరాయంగా చిత్రీకరణ జరిపాము. నా ప్రియమైన హీరో రవితేజ అచంచలమైన మద్దతు, అంకితభావం వల్ల ఈ సినిమా అంత బాగా రావాడానికి సాధ్యమైందని తెలిపాడు.
సినిమా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కు ప్రత్యేక ధన్యవాదాలు. వెంకీ సినిమా పట్ల మీరు చూపిన ప్రేమ నిజంగా ఫలించింది. ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన చూసి మేము ఉప్పొంగిపోతున్నాము.
ఈ రోజుకి కూడా మేము ఎక్కడికి వెళ్ళినా, ప్రజలు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా విడుదల, పునఃవిడుదల సమయంలో మీరు చూపిన ప్రేమను మేము ఎప్పటికీ పదిలపరుచుకుంటామని తెలియజేసాడు.



