ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో అమెరికాకు 750కి పైగా సైనిక స్థావరాలు…కానీ ఇండియాలో లేెదెందుకు…?
స్వాతంత్యం వచ్చిన తర్వాత భారత్ స్వయంప్రతిపత్తిని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి విదేశీ సైనిక స్థావరాలు మన భూభాగం లో ఉండకూడదనే కఠినమైన నిర్ణయం, అలీనంగా ఉండాలనుకున్న విధానం వలన మన దేశంలో విదేశీ సైనిక స్థావరాలుండవు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో తన ఎయిర్ బేస్ లను పెట్టుకోవాలని అమెరికాకు కోరిక ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో అమెరికాకు 750కి పైగా సైనిక స్థావరాలు ఉన్నప్పటికీ, భారతదేశ భూభాగంలో ఒక్క అమెరికా సైనిక స్థావరం కూడా లేదు.
ఖతార్‌లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడులు జరిగాయి. అమెరికా సైనిక స్థావరం ఉండవల్ల వలన ఖతార్ లక్ష్యంగా మారింది. ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉన్నాయని భారత్ వీటికి అవకాశం ఇవ్వదు. భారత్ తన సొంత రక్షణ నిర్ణయాలను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది, విదేశీ శక్తుల ప్రభావం కింద పనిచేయడానికి ఇష్టపడదు.
ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ఒక శక్తివంతమైన సైన్యం, అణు ఆయుధాలు, అధునాతన నావికా దళం, అంతరిక్ష ,సైబర్ యుద్ధం చేయగలగిన సామర్థ్యాలను కలిగి ఉంది.