పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మంది దుర్మరణం

ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 40 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. 

క్వెట్టా, జూలై 3 | నిజం న్యూస్

పాకిస్తాన్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలోచిస్థాన్–ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా సరిహద్దులోని డానా సార్ ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 40 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 8 మంది గాయపడ్డారు.

 

అధికారుల వివరాల ప్రకారం, బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తుండటంతో పాటు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉండటం ప్రమాద తీవ్రతకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

 

– శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button