IND vs PAK: ఇండియా – పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు..?

శ్రీలంక వాతావరణ శాఖ బంగాళాఖాతంపై చెలరేగిన అల్పపీడనం గురించి హెచ్చరించింది.  ఆదివారం సాయంత్రం ఖెట్టరామ ప్రాంతంలో వర్షం పడే అవకాశం 70 శాతం వరకు ఉంటుందని పేర్కొంది.

కొలంబో:  ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో  పాకిస్తాన్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, బంగ్లాదేశ్, శ్రీలంకతో వారాల తరబడి జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ ఆడటానికి అంగీకరించింది.

BCCI  కోల్‌కతా నైట్ రైడర్స్ జాబితా నుండి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని ఆదేశించడంతో ప్రారంభమైన గొడవలు  సరిహద్దు సంక్షోభంగా మారింది, ప్రస్తుతానికి ఆగిపోయి ఈ రోజు మ్యాచ్ జరగడానికి ఇరుజట్లు సిద్దంగా ఉన్నాయి.

రెండు జట్ల క్రికెటర్లు కూడా ఈ మ్యాచ్‌ను క్యాలెండర్‌లో మరో ఆటగా అభివర్ణిస్తూ, దానితో పాటు వస్తున్న హైప్‌ను తగ్గించడానికి ప్రయత్నించారు.

 

 నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ…

అభిషేక్ శర్మ శనివారం సాయంత్రం నెట్స్‌లో చాలా సేపు బ్యాటింగ్ చేయడంతో ఫిట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది.

“మీరు కోరుకుంటే, మేము అభిషేక్‌ను ఆడిస్తామని మీడియాతో  కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నవ్వుతూ సమాధానం ఇవ్వడంతో సంజు సామ్సన్ స్థానంలో ఇషాన్ కిషన్ తో ఓపెనింగ్‌కు రావడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది.

 

కుల్దీప్ యాదవ్‌ను ఆడించే అవకాశం…

 

పిచ్  స్వభావం వల్ల ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని  యాజమాన్యాన్ని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. కుల్దీప్‌ ను ఆడిస్తే రింకు సింగ్  బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది.  కుల్దీప్‌ను తీసుకోవడం వల్ల బాబర్ అజామ్‌పై అతనికి మంచి రికార్డు ఉంది. అంతేగాక చివరిగా దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో 30కి 4 వికెట్లు కూడా పడగొట్టాడు

భారత్ మిడిల్ ఆర్డర్ తడబాటు..
ప్రపంచ కప్ కు ముందు, భారత బ్యాటింగ్ లైనప్ బాగా కనిపించింది. కానీ ఈ ప్రపంచ కప్ లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో స్వల్ప వ్యవధిలో వరుసగా వికెట్లను కొల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

ముంబైలో USAతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం ఆరు వికెట్లు 77 పరుగులకు పడిపోగా,  నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో నాలుగు రన్స్ కే ఐదు వికెట్లు కోల్పోయింది. దీని వల్ల 200 కంటే ఎక్కువ స్కోరు చేయలేక పోయింది.

 

పాక్ జట్టులో ఐదుగురు సమర్థవంతమైన స్పిన్నర్లు..

కొలంబో పిచ్ పై పాకిస్తాన్ మంచి అవగాహన ఉంది.  ఆ జట్టులో ఐదుగురు సమర్థవంతమైన స్పిన్నర్లు ఉన్నారు.  ఉస్మాన్ తారిక్, సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ మరియు మహ్మద్ నవాజ్.

తారిక్ యొక్క సైడ్-ఆర్మ్ స్టాప్ మరియు పాజ్ యాక్షన్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది.

వర్షం పడే అవకాశం ఉందా?

శ్రీలంక వాతావరణ శాఖ బంగాళాఖాతంపై చెలరేగిన అల్పపీడనం గురించి హెచ్చరించింది.  ఆదివారం సాయంత్రం ఖెట్టరామ ప్రాంతంలో వర్షం పడే అవకాశం 70 శాతం వరకు ఉంటుందని పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button