BSNL లో 120 మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. టెలికాం స్ట్రీమ్, ఇందులో అత్యధికంగా 95 ఖాళీలు ఉన్నాయి. ఫైనాన్స్ స్ట్రీమ్, ఇందులో 25 ఖాళీలు ఉన్నాయి.

టెలికాం రంగంలో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగం సాధించాలనుకునే యువతకు భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.
దేశవ్యాప్తంగా నూట ఇరవై సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు, విభాగాల వివరాలు, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. టెలికాం స్ట్రీమ్, ఇందులో అత్యధికంగా 95 ఖాళీలు ఉన్నాయి. ఫైనాన్స్ స్ట్రీమ్, ఇందులో 25 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు, వయోపరిమితి…
విద్యార్హతలు, వయోపరిమితి, అర్హతల విషయానికొస్తే టెలికాం విభాగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం అరవై శాతం మార్కులతో బిఇ లేదా బిటెక్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఫైనాన్స్ విభాగానికి సిఏ లేదా సిఎంఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 30 మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. వేతనం, ఇతర ప్రయోజనాలు ఎంపికైన అభ్యర్థులకు ఐడిఏ ఇ త్రీ గ్రేడ్ క్రింద నెలకు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల నుంచి యాభై వేల ఐదు వందలు రూపాయల వరకు వేతన శ్రేణి ఉంటుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిఏ, హెచ్ ఆర్ ఏ ఇతర వైద్య సౌకర్యాలు లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం…
ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ ద్వారా జరుగుతుంది. ఈ పరీక్షలో రెండు ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి ఆప్టిట్యూడ్, రెండోది అభ్యర్థికి సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్.
అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు ప్రతి విభాగంలో నలభై శాతం ఓవరాల్ గా యాభై శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. రిజర్వుడ్ వర్గాలకు ఇందులో ఐదు శాతం రాయితీ ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి ఐదు, రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి ప్రారంభం కానుంది.
దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 7 ..
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7 చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు బిఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ బిఎస్ఎన్ఎల్ డాట్ కో డాట్ ఇన్ ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.



