స్తంభం ప్లాట్లలో పాతడమేంటి?

జడ్చర్ల, ఏప్రిల్ 28, (నిజం చెపుతాం)
పట్టణ కేంద్రంలోని సంచలనంగా మారిన రోడ్డు ఆక్రమించరని కొందరు 282 సర్వే నంబర్ ప్లాట్లల బాధితులు శనివారం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల పట్టణ కేంద్రంలోని 281/అ సర్వే నెంబర్ మహ్మద్ జాకీర్ అనే వ్యక్తి 2008 లో నందు ప్లాటును కోనుగోలు చేశా నని, 282 సర్వే నెంబర్ వాళ్లు కొందరు ఇది రోడ్డు నీ ప్లాటు కాదు అని వచ్చారని తెలిపారు. పాత లేఅవుట్ ప్రకారం రోడ్డు లేదని, అయితే 2012 లో కోర్టు లో పిటిషన్ దాఖలు చేశానని బాధితుడు జాకీర్ చెప్పాడు. 2017 లో తన పరిధిలో జడ్చర్ల జూనియర్ సివిల్ జడ్జి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారని మహ్మద్ జాకీర్ వెల్లడించారు. ఇప్పటికి 282 సర్వే నంబర్ ప్లాట్లల బాధితులు తమను ఇళ్ళు నిర్మాణం అడ్డుకోని భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో పోలి సుల, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిందని అయిన కూడా పనులు అపుతున్నారని భాధితుడు మహ్మద్ జాకీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా మరో ప్లాటు బాధితురాలు హజీరా బేగం తమ ప్లాటులో రోడ్డు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా కొందరు అధికార పార్టీ నాయకుడు మహ్మద్ ఆసిఫ్ తమ ప్లాటులో విద్యుత్ అధికారులపై ఒత్తిడి చేసి స్తంభం వేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్లాటులో గంటలో స్తంభం వేసిన అధికారులు చర్యలు తీసుకోవా లని కోరారు ఉన్నత అధికారులు స్పందించాలని కోరారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button