అద్భుత ఛాయ చిత్రాలకు@జిల్లా పౌర శాఖ.
పుష్కరాన్ని ప్రజల చెంతకు చేరేలా, 12 రోజులు కృషి,జిల్లా పౌర శాఖ బేస్.

- అద్భుత ఛాయ చిత్రాలకు@జిల్లా పౌర శాఖ.
పుష్కరాన్ని ప్రజల చెంతకు చేరేలా, 12 రోజులు కృషి,జిల్లా పౌర శాఖ బేస్.
గడిచిన 11 రోజులు అంత్య పుష్కరాల్లో డి పి ఆర్ ఓ సేవలు అదుర్స్.
ప్రతి సమాచారం ప్రజల వద్దకు చేరేలా శాఖ కృషి.
డి పి ఆర్ ఓ సేవలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కు వెన్నె.
జిల్లా పౌర సరఫరాల శాఖ సేవలకు, అభినందనలు.
మహాదేవపూర్, భూపాలపల్లి, (నిజం న్యూస్)
ఒకవైపు పవిత్ర పుణ్యక్షేత్రం, వెలాది భక్తుల దర్శనలు పుణ్యస్నానాలు, రాష్ట్రం తో పాటు పక్క రాష్ట్రాల్లో సరస్వతి అంత్య పుష్కరాల పవిత్ర ఘడియలు, వెల భక్తుల రాక, భరించలేని ఎండ తీవ్రత, భక్తులకు సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ప్రభుత్వ కార్యకలాపాలు, పూజలు పురస్కారాలు, పుణ్యస్నానాలు, పుష్కర ప్రత్యేక కార్యక్రమాలు, వీటిలో అద్భుతాలను వెలికి తీసి ఛాయా చిత్రాలను, ప్రజలకు తెలియపరిచేలా, సృష్టిలోని అద్భుతాలు మరెన్నో కాదు ఇదే సృష్టి యొక్క అద్భుతం అనేలా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పౌర సంబంధాల శాఖ, సరస్వతి అంత్య పుష్కరాల ఛాయాచిత్రాలను చిత్రీకరించి, దేశ ప్రజలకు పవిత్రమైన పుష్కర పవిత్రతను చాటి చెప్పి లా చేసింది. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు డి పి ఆర్ ఓ ద్వారా అందించిన ఛాయాచిత్రాలు వీడియోలు, అంతర్జాతీయ ఛాయా చిత్ర పరిశ్రమను తలకిందులుగా చేసే విధంగా జిల్లా పౌర సంబంధాల శాఖ చిత్రీకరించడం చిత్ర వ్యవస్థలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని రాసింది.
*పుష్కరాన్ని ప్రజల చెంతకు చేరేలా, 12 రోజులు కృషి,జిల్లా పౌర శాఖ బేస్.*
గడిచిన 11 రోజులు నేటి జూన్ ఒకటవ తేదీ నాటికి 12 రోజుల పవిత్ర పుష్కర ఘడియల్లో ప్రారంభం రోజు నుండి, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి తో పాటు, శాఖ సిబ్బంది, విఐపి స్వాగతం నుండి మొదలుకొని, విఐపి ల కార్యక్రమాల, వివరాలు, ప్రభుత్వ ఉన్నత అధికారులు మరియు మంత్రుల, పూర్తిస్థాయి కవరేజ్, రేపటి అధికారుల పర్యటన, విఐపి కార్యక్రమాల వివరాలు అందిస్తూ, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కు ఎంతో సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ఐ ఎన్ పి ఆర్ విధి నిర్వహణ బాధ్యతగా, ఎండ తీవ్రతకు పాత్రికేయ ప్రతినిధులు ఇబ్బందులు కలగకుండా, డిపిఆర్ఓ సిబ్బంది ఎండలు సైతం లెక్కచేయకుండా, సమాచార సేకరణ ఛాయా చిత్రాలు మరియు వీడియోల కొరకు, గోదావరి పుష్కర ఘాట్ తోపాటు ప్రధాన ఆలయం, వీఐపీ ఘాట్, తుపాటు కాలేశ్వరం లోని పుష్కర ప్రాంతమంతా తమ ఆధీనంలో పెట్టుకొని, ప్రతి సమాచారం క్షణక్షణం ప్రచురణార్థం అందించడంలో డి పి ఆర్ ఓ తో పాటు సిబ్బంది సేవలు అదుర్స్ అని చెప్పడంలో సందేహం లేదు.
*ప్రతి సమాచారం ప్రజల వద్దకు చేరేలా శాఖ కృషి.*
పుష్కరాల్లో ప్రభుత్వం, నిర్వహించి అనేక కార్యక్రమాలు, ప్రత్యేకంగా పవిత్ర పుష్కర పుణ్య స్నానానికి సంబంధించి, పుష్కర ఘాట్ వద్ద, భక్తులతో పాటు వీఐపీ పుణ్య స్నానాలకు సంబంధించి అద్భుతమైన ఛాయాచిత్రాలు మరియు వీడియోలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలకు సంబంధించిన చిత్రీకరణ, పారిశుద్ధ్యం, మెడికల్, అత్యవసర సేవ, తో పాటు ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అధికారుల పర్యవేక్షణకు సంబంధించి వివరాల సేకరణ, గర్భగుడి వద్ద నిర్వహించబడుతున్న కార్యక్రమాలు, అలాగే సాయంత్రం ఏర్పాటుచేసిన పుష్కర ప్రత్యేక హారతి కార్యక్రమాలు, చిత్రాలు మరియు వీడియోలు అందించడంలో జిల్లా డిపిఆర్ఓ సేవలు అభినందనీయంగా చెప్పవచ్చు. జిల్లా పౌర సరఫరాల శాఖ క్షుణంగా ఇచ్చిన సమాచారం ప్రచురణ తో రాష్ట్ర మరియు దేశ నలుమూలలకు పుష్కర పవిత్రత, అద్భుతమైన చిత్రీకరణ అందించడం తో భక్తులకు పుష్కరంపై మరింత నమ్మకం పెరిగి భక్తులు అధిక సంఖ్యలో పుష్కరాలకు వచ్చేలా చేసింది. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి మరియు సిబ్బంది, 11 రోజుల పవిత్ర పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్ని, అద్భుతమైన చిత్రాలు వీడియోలను అందించడంతో, వాటిని ఉపయోగించుకున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు, ఇండిపెండెంట్ ఫ్రీ లాంచ్, జర్నలిస్టులకు వెన్నె తెచ్చేలా చేసింది. మరోవైపు పుష్కర సమాచారం సామాజిక మాధ్యమంలో పౌర సంబంధాల శాఖ ద్వారా, చిత్రీకరించిన అద్భుతమైన ఘట్టాల చిత్రాలు వీడియోలు సామాజిక మాధ్యమంలో చక్కెరలు కొడుతున్న క్రమంలో, ప్రజలు సైతం జిల్లా డిపిఆర్ఓ శాఖకు అభినందించక తప్పడం లేదు.



