పిడుగుల ముప్పు.. తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్..!

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరికల ప్రకారం, రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్: మే 06

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరికల ప్రకారం, రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

 

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

మహబూబాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలవకూడదని హెచ్చరించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button