ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
నిజం న్యూస్, హైదరాబాద్, జులై 19
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
వచ్చే నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించనున్నారు. ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. అయితే వచ్చే నెలలో మూడు నెలల రేషన్‌ను ఒకేసారి ఇవ్వనున్న నేపథ్యంలో ఆగస్టు నెలలో మొత్తం 31 రోజులు రేషన్ దుకాణాలు తెరిచి బియ్యం అందించాల్సి ఉంది.
ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోటాలకు సంబంధించి బయోమెట్రిక్ ధృవీకరణ విడివిడిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు. ఈ పథకం 2028 వరకు కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేసే అంశంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
-శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



