ప్రజల కొరకు స్ట్రాంగ్ పోలీస్.
నూతన ఎస్సై కు ప్రెస్ క్లబ్ సన్మానం.

ప్రజల కొరకు స్ట్రాంగ్ పోలీస్.
నూతన ఎస్సై కు ప్రెస్ క్లబ్ సన్మానం.
మహాదేవపూర్, భూపాలపల్లి మే 13 నిజం న్యూస్.
ప్రజల రక్షణ కొరకు స్ట్రాంగ్ పోలీసింగ్ వ్యవస్థ అమలు పరచడం జరుగుతుంది,ప్రజలు నేరుగా తమ సమస్యలను పోలీస్ స్టేషన్ కు వచ్చి నిర్భయంగా ఫిర్యాదు చేయాలని అన్నారు మహాదేవపూర్ నూతన అమీన్ కచేరి సాంబమూర్తి.మహాదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ల్యాండ్ ఆర్డర్ కాపాడుటకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సహకరించాలని అన్నారు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, గంజాయి గుడుంబా నిషేధిత పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం తక్షణ సమాచారం అందించి శాంతి భద్రతకు సహకరించాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా సమస్యలు ఎదురైతే బాధితులు ఏలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా నేరుగా తమ సమస్యను పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరించి ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే మైనర్లకు వాహనాల ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని,డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి అని, రోడ్డు ప్రమాదాలు నివారణ కై నిబంధనలు పాటించాలని అన్నారు సబ్ ఇన్స్పెక్టర్ సాంబమూర్తి.
నూతన ఎస్సై కు ప్రెస్ క్లబ్ సన్మానం.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహాదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సాంబమూర్తి కి మహాదేవపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మిన్నుభాయ్ ఆధ్వర్యంలో, పాత్రికేయులు సయ్యద్ షఫీ, అనిల్ కుమార్, మునవర్, సంతోష్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతూ వారికి శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, లాండ్ ఆర్డర్ పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర కూడా ఎంతో ముఖ్యమని, తనకు స్వాగతం పలుకుటకు పాత్రికేయులు రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అన్నారు సబ్ ఇన్స్పెక్టర్ సాంబమూర్తి.



