సింగరేణి కెటికె 5 లో పేలుడు

సింగరేణి కెటికె 5 లో పేలుడు
భూపాలపల్లి కేటీకే ఐదవ గదిలో ప్రమాదం.
13 వ లెవెల్ లో బ్లాస్టింగ్ ,తొలి షిఫ్టులో ఘటన.
కార్మికునికి తీవ్ర గాయాలు, ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలింపు.
ఘటనపై అధికారుల విచారణ.
కార్మికులు కార్మిక సంఘాల్లో పలు అనుమానాలు.!?
భూపాలపల్లి మహాదేవపూర్, జూన్ 15( నిజం న్యూస్)
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కెటికె అయిదవ గనిలో బ్లాస్టింగ్ చేస్తున్న క్రమంలో పేలుడు ప్రమాదం సంభవించి ఒక కార్మికునికి తీవ్ర గాయాలు అయిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజు కేటీకే అయిదవ గనిలో 13వ లెవెల్ కు సంబంధించి బ్లాస్టింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో, పేలుడు సంభవించడంతో కార్మికునికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. పేలుడు శబ్దాన్ని విన్న కార్మికులు అప్రమత్తమై, షార్ట్ ఫైర్ శ్రీరాములు, ప్రదీప్ కు బయటకు తీసి ప్రధమ చికిత్స కొరకు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. గాయాలు ఎక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్ కు ధరించినట్లు తెలుస్తుంది. ఒకేసారి గనిలో అనుకోకుండా ప్రమాదం పెలుడు ప్రమాదం సంభవించడం కార్మికులకు భయ ప్రాంతాలకు గురిచేసింది.
13 వ లెవెల్ లో బ్లాస్టింగ్ ,తొలి షిఫ్టులో ఘటన.
కేటీ కె ఐదవ గనిలో 13వ లెవెల్ మొదటి షిఫ్ట్ లో బొగ్గు ఉత్పత్తి కొరకు నిర్వహించబడి బ్లాస్టింగ్ కార్యక్రమంలో పేలుడు సంభవించడం, కార్మికులకి తీవ్ర గాయాలు కావడం భూపాలపల్లి సింగరేణి నిర్వహణపై చర్చ మొదలైంది. మొదటి షిఫ్ట్ లోనే పేలుడు ప్రమాదం సంభవించడం కార్మికుల్లో కాస్త భయం తోడులను పరిస్థితికి దారితీసింది. మరోవైపు సంఘటనపై అధికారులు ఆరా తీస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. బొగ్గు గనుల ఉత్పత్తి కొరకు బ్లాస్టింగ్ ప్రక్రియలో పేలుడు సంభవించడం గనుల్లో భద్రత ప్రమాణాలు పేలుడు పదార్థాల నిర్వహణపై పలు రకాల అనుమానాలు, కార్మికుల్లో మొదలైనట్లు తెలుస్తుంది. పేలుడు పై అధికారుల విచారణలో ఏమి తెలుస్తుందో వేచి చూడాలి……



