హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్
హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పోస్టు ఖాళీగా ఉండగా కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఇన్చార్జి జడ్జిగా పనిచేస్తున్నారు.

భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఎన్ శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకు మునుపు సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన రాధాకృష్ణ చౌహాన్ పదోన్నతి పై బదిలీ కాగా అప్పటినుండి హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు పోస్టు ఖాళీగా ఉండగా కోదాడ సీనియర్ సివిల్ జడ్జి సురేష్ ఇన్చార్జి జడ్జిగా పనిచేస్తున్నారు.
ఖాళీగా ఉన్న సీనియర్ సివిల్ జడ్జి పోస్టును నూతన జడ్జి నియామకము తో హైకోర్టు భర్తి చేసింది.
ఈనెల 25 వ తేదీ లోగా నూతన న్యాయమూర్తి తన బాధ్యతలను స్వీకరించాలని ఆ ఉత్తర్వుల లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 మంది సీనియర్ సివిల్ జడ్జిల ను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.



