రాజస్థాన్‌ను కమ్మేసిన ఇసుక తుఫాన్.. 100 అడుగుల ఎత్తులో దూసుకొచ్చిన ధూళి మేఘం భయాందోళన!

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు, బికనీర్, భానీపురా తదితర ప్రాంతాల్లో శుక్రవారం (మే 29) భారీ ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ముంచుకొచ్చిన సాండ్ స్టార్మ్ కారణంగా దాదాపు 100 అడుగుల ఎత్తులో ఇసుక మేఘాలు నగరాలను కమ్మేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తీవ్ర వేడి పరిస్థితుల మధ్య అకస్మాత్తుగా వచ్చిన ఈ ఇసుక తుఫాన్ తర్వాత పలుచోట్ల భారీ వర్షం కూడా కురిసింది.

నిజం న్యూస్ | మే 30, 2026

ఇసుక తుఫాన్ కారణంగా రహదారులపై విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ పొలాలు ఇసుకతో నిండిపోగా, ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భారీ ఇసుక గోడలా నగరాల వైపు దూసుకొస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వాతావరణ శాఖ నిపుణుల ప్రకారం, రాజస్థాన్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, బలమైన ఈదురు గాలులు కలిసి ఈ ఇసుక తుఫాన్‌కు కారణమయ్యాయని తెలిపారు. పశ్చిమ అంతరాయం (Western Disturbance) ప్రభావంతో తుఫాన్ అనంతరం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గినట్లు సమాచారం.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button