‎మెడిగడ్డ కార్యాలయం దగ్ధం

షార్ట్ సర్కిల్ తో పూర్తిగా కాలిన కార్యాలయం. గత నెల ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన ఇదె కార్యాలయం. మేడిగడ్డకు సంబంధించి ప్రధాన ఫైల్లు ఈ కార్యాలయంలోనే. ఉన్నట్లు సమాచారం. ‎ అందుబాటులో లేని ఫైర్ ఇంజన్ మేడిగడ్డ కార్యాలయం దగ్ధం పై అనుమానాలు.!?

  • ‎మెడిగడ్డ కార్యాలయం దగ్ధం.
  • షార్ట్ సర్కిల్ తో పూర్తిగా కాలిన కార్యాలయం.
  • గత నెల ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన ఇదె కార్యాలయం.
  • మేడిగడ్డకు సంబంధించి ప్రధాన ఫైల్లు ఈ కార్యాలయంలోనే. ఉన్నట్లు సమాచారం.‎ అందుబాటులో లేని ఫైర్ ఇంజన్
  • మేడిగడ్డ కార్యాలయం దగ్ధం పై అనుమానాలు.!?
  • మహాదేవపూర్ భూపాలపల్లి: (నిజం బ్రేకింగ్ న్యూస్)
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా మెడిగడ్డ ప్రాజెక్ట్ కార్యాలయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గురై పూర్తిగా గాలి బూడిద కావడం జరిగింది. మండలంలోని అంబటిపల్లి మెడిగడ్డ వద్ద నిర్మించిన ఎల్ ఎన్ టి కార్యాలయం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గురై, భారీ మంటలు చెరరేగి కార్యాలయం పూర్తిగా కాలి బూడిద కావడం జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మెడిగడ్డ కార్యాలయం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంలో ఏలాంటి ప్రాణహాని కలగలేదని తెలుస్తుంది. సుమారు ఒక గంట హరి మంటలు చిలరేగుతున్న క్రమంలో, అగ్ని మాపక శాఖకు ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా కార్యాలయం దగ్ధం కావడం జరిగింది. ఇప్పటికీ ఇంకా భారీ మంటలు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. గత నెల మెడిగడ్డ సందర్శన తోపాటు రైతు భరోసా యాత్ర ప్రారంభానికి ముందు మేడిగడ్డ మరమ్మతుకు సంబంధించి, ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం తో పాటు పత్రిక సమావేశం ఏర్పాటు చేసిన ఎల్ ఎన్ టి కార్యాలయం ఇదే. ఇక ప్రస్తుతం వీడిగడ్డ ప్రధాన కార్యాలయం షార్ట్ సర్క్యూట్ కు గురికావడం, ఈ కార్యాలయంలోని అన్ని బ్యారేజ్ కు సంబంధించిన ప్రధాన ఫైల్ మరియు పత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మేడిగడ్డ ప్రధాన కార్యాలయం షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురైందా లేదా మరేమైనా కారణాలతో సంఘటన చోటు చేసుకుందా ప్రధాన కార్యాలయం చూస్తుండగానే బూడిద కావడం పై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button