కావాలని కాంట్రాక్టర్ రైస్ మిల్లును కాపాడుతున్నారా.!?

కావాలని కాంట్రాక్టర్ రైస్ మిల్లును కాపాడుతున్నారా.!?

మహాదేవపూర్,భూపాలపల్లి: (నిజం న్యూస్)

కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుండి మొదలుకొని కాంట్రాక్టర్ రైస్ మిల్లు నిర్వాహకుల వరకు అంతా ఒక్కటై, ఆరు కాలం కష్టపడి పండించిన రైతు ధాన్యం, రవాణా తో మొదలుకొని తాలు తరుగు పేరుతో కోత విధించి లక్షల రూపాయల సొమ్మును దోచుకుంటుంటే, అధికారులు ఎక్కడ ఉన్నారు, కాంట్రాక్టర్ లారీలు లేకున్నా టెండర్ దక్కించుకొని, రైతులే సొంత డబ్బులను వెచ్చించి ధాన్యం బస్తాలు పది రూపాయల నుండి 15 రూపాయల వరకు ప్రైవేట్ లారీలను ఏర్పాటు చేసుకొని, మిల్లుకు తరలించడం జరుగుతుంది, కానీ నో అధికారులు, ఇక అలాట్మెంట్ పొందిన అన్నపూర్ణ రైస్ మిల్, రైతుల నుండి వచ్చిన ధాన్యానికి బస్తాకు రెండున్నర కిలో, నుండి మూడు కిలోల వరకు, మిల్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోత విధించడం గత 25 రోజుల నుండి, దర్జాగా కొనసాగిస్తున్న, చర్యలకు నో అధికారులు. ప్రభుత్వ ఆదేశాలు అధికార యంత్రాంగం అమలు చేయడం లేదని, స్పష్టంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలో, వరి కొనుగోలు వ్యవహారం, ఒక అక్రమ వ్యాపారంగా మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగుతుంది అది చెప్పుటకు, ప్రైవేట్ లారీల్లో రైతులే ధాన్యం రవాణా చేయడం, రక్షిత్ వెనుక తరుగు పేరుతో కోత విధించడం జరిగిందని అన్నపూర్ణ రైస్ మిల్ నిర్వాహకులు ఇచ్చిన, రషీద్ ఏ ఒక సాక్ష్యం. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం మౌనం ఎందుకు అని ప్రశ్నిస్తున్న రైతులకు మాత్రం, ఇప్పటికీ సమాధానం లేదు, లారీలే లేని వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగించడం, దర్జాగా ట్రక్ షీట్ వెనుక అన్నపూర్ణ రైస్ మిల్ కోత విధించడం జరిగిందని రాసి ఇచ్చినా కూడా, అధికారుల మౌనం వెనుక భారీ ముడుపులు దండుకున్నారని స్పష్టం అవుతుంది, అందుకే అధికార యంత్రాంగం మౌనం పాటిస్తుందని చెప్పక తప్పడం లేదు. దానికి సాక్షాలే ఈ రసీదులు, రైతుల ఖాతాల నుండి ప్రైవేట్ లారీలకు అందించిన రూపాల ఫోన్ పే ఆధారాలే సాక్ష్యలు.

.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button