7వ రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె..!

హుజూర్ నగర్ డివిజన్ కార్యాలయం వద్ద భారీ నిరసన..!

విద్యుత్ శాఖ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ డివిజన్ కార్యాలయం ముందు ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఆర్టిజన్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విద్యార్హతలను బట్టి కన్వర్షన్ ప్రక్రియను చేపట్టాలన్నారు.

2016 డిసెంబర్ 4 కంటే ముందున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ సంస్థలో విలీనం చేయాలి.పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు (జీవో 11) అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆర్టిజన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతోనే విధిలేక సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని వారు స్పష్టం చేశారు.

సుమారు 20 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వెంటనే జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో-చైర్మన్ ఎం.వి.ఎన్ చార్యులు, డివిజన్ చైర్మన్ పిడతల శ్రీనివాసరావు, నాయకులు బత్తిన రామయ్య, బొమ్మపాల వేణు, డి.శంకర్, ఎన్. తిరుపతి రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button