కలెక్టర్ గారు ఇసుక లారీలు సరే, కాంట్రాక్టర్ లారీలు ఎక్కడ.?

కలెక్టర్ గారు ఇసుక లారీలు సరే, కాంట్రాక్టర్

కలెక్టర్ గారు ఇసుక లారీలు సరే, కాంట్రాక్టర్ లారీలు ఎక్కడ.?

మహాదేవపూర్ భూపాలపల్లి (నిజం న్యూస్)

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ కాటారం సబ్ డివిజన్ పరిధిలో, కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో పాటు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, కోత పేరుతో అన్నపూర్ణ రైస్ మిల్ అరాచకం, ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా రైతుల కష్టాన్ని  దోచుకుంటున్న ఈ త్రిమూర్తులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇంకా నిలిచి ఉన్నప్పటికీ, రవాణా కొరకు ఇప్పటికే 70 శాతం రైతులు తమ ధాన్యాన్ని సొంత ఖర్చుతో బిల్లుకు తరలించుకున్న క్రమంలో, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ధాన్యం దిగుమతి కొరకు సబ్ డివిజన్ పరిధిలోని రుద్ర మరియు మీనాక్షి బిల్లులలో కొనసాగుతున్న ధాన్యం దిగుమతిని సందర్శించి, కొనుగోలు కేంద్రాల నుండి దాన్యం రవాణా కొరకు టీజీఎండిసి పరిధిలో కొనసాగుతున్న ఇసుక క్వారీల నుండి ఇసుక రవాణాకు వచ్చే లారీలను, ధాన్యం రవాణాకు ఉపయోగించాలని ప్రాజెక్ట్ అధికారికి కలెక్టర్ ఆదేశించడం తో సబ్ డివిజన్ పరిధిలోని రైతులు తమ ధాన్యం ఇక మిల్లుకు తరులుతాయని హర్షం వ్యక్తం చేస్తూ ఆనందంలో మునిగిపోయారు, మరోవైపు అధిక సంఖ్యలో రైతులు ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ధాన్యం చెడిపోకుండా రైతులు సబ్ డివిజన్ పరిధిలో సుమారు 70%, ధాన్యాన్ని సొంత ఖర్చుతో లారీలు సమకూర్చుకొని ధాన్యాన్ని రవాణా చేసుకోవడం జరిగింది, రైతులు రవాణా చేసుకున్న లారీల భారీ రుసుము తిరిగి రైతులకు కలెక్టర్ అందిస్తారని ఆశిస్తున్నారు. అంతేకాకుండా అన్నపూర్ణ రైస్ మిల్ లో ఇప్పటికీ సుమారు సబ్ డివిజన్ పరిధి నుండి 1500 నుండి 2000 లారీల వరకు ధాన్యం రవాణా చేయడం జరిగింది, వాటిలో అన్నపూర్ణ రైస్ మిల్ తాలు తరుగు తో పాటు గింజలు నల్లబడ్డాయని, సంచి తరుగు ఒక్క కిలో నుండి ప్రారంభించి తరుగు పేరుతో మరో కిలోన్నర నుండి రెండు కిలోల వరకు ప్రతి సంచికి మూడు కిలోల చొప్పున, కోత విధించి రైతుకు పెద్ద మొత్తంలో నష్టాన్ని వాటిల్లేలా చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా తక్షణమే కలెక్టర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు రైతులు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button