ఉద్యోగం కన్నా ఇసుక క్వారీ ముద్దు.

పాఠశాల వదిలిపెట్టి ఇసుక క్వారీ పనికి వెళ్లిన ఉపాధ్యాయుడు. సెలవు పెట్టిండా డుమ్మ కొట్టిండా, వేల జీతం సరిపోవడం లేదా. ఇసుక టార్పాల్ పనిలో అంతా డబ్బు వస్తుందా. ఉపాధ్యాయుని వ్యవహారంపై, మండలంలో చర్చ. విద్యాశాఖ నిర్లక్ష్యం, స్పష్టంగా కనబడుతుంది అంటున్న ప్రజలు.

ఉద్యోగం కన్నా ఇసుక క్వారీ ముద్దు.

పాఠశాల వదిలిపెట్టి ఇసుక క్వారీ పనికి వెళ్లిన ఉపాధ్యాయుడు.

సెలవు పెట్టిండా డుమ్మ కొట్టిండా, వేల జీతం సరిపోవడం లేదా.

ఇసుక టార్పాల్ పనిలో అంతా డబ్బు వస్తుందా.

ఉపాధ్యాయుని వ్యవహారంపై, మండలంలో చర్చ.

విద్యాశాఖ నిర్లక్ష్యం, స్పష్టంగా కనబడుతుంది అంటున్న ప్రజలు.

మహాదేవపూర్ భూపాలపల్లి ఏప్రిల్ 17 (నిజం న్యూస్)

ప్రభుత్వ ఉద్యోగి పేద విద్యార్థులకు విద్యను అందించుటకు ప్రభుత్వం వేల రూపాయల జీతాన్ని అందిస్తూ ఉపాధ్యాయునిగా అవకాశం ఇచ్చినప్పటికీ, తమకు ఎవరు పట్టించుకుంటారు, విద్యార్థుల చదువు ఏమైతే నాకేంటి, ఇసుక క్వారీ సీరియల్ టార్ పాల్ అమర్చుటకు పోతే, 3000 నుండి 5000 వరకు ఒకరోజు సంపాదన వస్తుందని, పరిమళ మండలంలోని దమ్ముర్ ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గంట లక్ష్మణ్, శుక్రవారం పాఠశాల విధులకు వెళ్లకుండా మహాదేవపూర్ లో నిర్వహించబడే ఇసుక క్వారీ టార్పాల్ పనికి రావడం, చర్చనీయాంశంగా మారి ప్రభుత్వ విద్యాశాఖ పర్యవేక్షణ లోపం, స్పష్టంగా కనబడుతుందని దానికి నిదర్శనమే, పాఠశాల వదిలిపెట్టి లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు, ఇసుక క్వారీ టార్పాల్ పనికి రావడమే ఒక బలమైన సాక్ష్యం అంటున్నారు.

పాఠశాల వదిలిపెట్టి ఇసుక క్వారీ పనికి వెళ్లిన ఉపాధ్యాయుడు.

ప్రభుత్వ ఉద్యోగం కొరకు నానా తంటలు పడుతున్న ఈ రోజుల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం దమ్ముర్ ఎంపీపీ ఎస్, పాఠశాలలో మహాదేవపూర్ గ్రామవాసి, గంట లక్ష్మణ్ ఉపాధ్యాయుడు తమ ప్రభుత్వ ఉద్యోగానికి, విద్యార్థులకు విద్యను అందించకుండా మహాదేవపూర్ మండల కేంద్రంలో నిర్వహించబడుతున్న ఇసుక క్వారీ లో లారీలపై టార్ పాల్ వేయుటకు, పాఠశాల విధులను ధిక్కరించి, రోజుకు 3000 నుండి 5000 వస్తాయని గురువారం రోజు ఒక ఇసుక క్వారీ లో టార్పాల్ పనిచేయడం జరిగింది. లక్ష్మణ్ అనే ఈ ఉపాధ్యాయునికి ప్రభుత్వ ఉద్యోగం కన్నా టార్పాల్ అమర్చే పని, విద్యార్థులకు విద్యను అందించడం కన్నా, గొప్ప పని మరి ఎక్కువ ఆదాయం అని భావించి, విద్యార్థులు మరియు పాఠశాలకు గాలికి వదిలి, ఇసుక క్వారీ టార్పాల్ పనికి రావడం, ప్రభుత్వ ఉద్యోగం విలువను,అభసూపలు చేసి ప్రజల సొమ్ముతో తీసుకునే జీతానికి,బాధ్యత లేకుండా చేయడం జరిగిందని స్పష్టంగా కనబడుతుంది.

ఉపాధ్యాయుని వ్యవహారంపై, మండలంలో చర్చ.

  • మహదేవపూర్ మండలంలో పలిమెల మండలంలోని దమ్ముర్ ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్ విధులకు బదులు, ఇసుక క్వారీలో తార్పాల్ పనికి రావడం. పాఠశాలకు సెలవు పెట్టి టర్పాల్ పనికి వచ్చాడా లేక, విధులు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్ లో సంతకం చేసి ఇసుక క్వారీ టార్పాల్ పనికి వచ్చాడా, అనేది తెలవనప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగం అలాగే ఉపాధ్యాయుని ఉద్యోగం ఎంతో, పవిత్రతతో కూడిన ఉద్యోగం అలాగే బాధ్యత ఉంటుంది ప్రస్తుతం లక్ష్మణ్ విధులు నిర్వహిస్తుంది, గిరిజన అటవీ ప్రాంతాల్లోని నిస్సాయమైన పేదల పిల్లలకు విద్యను అందించుటకు ఉపాధ్యాయుడిగా నియమించడం జరిగింది. లక్ష్మణ్ కు ఉపాధ్యాయ వృత్తిలో, పేద పిల్లలకు విద్యను అందించడం ఇష్టం లేదా లేక ప్రభుత్వ ఉపాధ్యాయుని కన్నా ఇసుక క్వారీ టార్పాల్ పనిలో, రెట్టింపు జీతం వస్తుందేమో అందుకే, విధులను డుమ్మా కొట్టి ఇసుక క్వారీ పనికి రావడం జరిగిందని స్పష్టం అవుతుంది. ప్రస్తుతం మహాదేవపూర్ మండలంలో ప్రభుత్వ ఉద్యోగి విధులకు డుమ్మా కొట్టి ఇసుక క్వారీలో టార్పాల్ పనికి రావడం, సత్వర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా వేలెత్తి చూపుతున్నారు ప్రజానీకం. మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల విధుల నిర్వహణ విషయంతో పాటు పాఠశాల మౌలిక వసతుల కల్పన విషయంపై, ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, సంవత్సరం చివరి దశ వార్షిక పరీక్షలు కొనసాగుతున్న క్రమంలో, విద్యాశాఖ మరియు, అధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల విధుల నిర్వహణలో, జాప్యం తోపాటు, పేద విద్యార్థులకు ఉపాధ్యాయులు పట్టించుకోవడంలేదని, చెప్పడానికి ఉపాధ్యాయుడు విధులను డుమ్మా కొట్టి ఇసుక క్వారీ టార్పాల్ పనికి వెళ్లిన వ్యవహారమే సాక్ష్యం అని అంటున్నారు మండల ప్రజలు. దీనిపై జిల్లా కలెక్టర్ మరియు విద్యాధికారి తక్షణమే, విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని, ఉమ్మడి మండలంలో ఎందరు ఉపాధ్యాయులు, పాఠశాలలకు వస్తున్నారు, పాఠశాలలకు రాకుండానే హాజరులు నమోదు చేస్తూ తమ పనులను కొనసాగిస్తున్నారా అనేది విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు ప్రజలు

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button