నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం నియామకం

జీవో ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్ రెడ్డి

17 మందితో నూతన పాలకవర్గం ఏర్పాటు – రెండేళ్ల పాటు పదవీకాలం

జీవో ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

నెరేడుచెర్ల అక్టోబర్ 8 నిజం చెపుతాం న్యూస్ :

రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం నియమితమైంది.

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఐదవ పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ, సహకార శాఖ జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 687 ప్రకారం మార్కెట్ కమిటీ నూతన చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.

తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద మార్కెట్ల చట్టం–1966లోని సంబంధిత నిబంధనల ప్రకారం నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పాలకవర్గం కొనసాగనుంది.

నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు

1. రంగినేని స్పందన – చైర్‌పర్సన్

2. మునగాల భాస్కర్ రెడ్డి – వైస్ చైర్మన్

3. సూరోజు రవీంద్ర చారి – సభ్యుడు

4. పొతురాజు జ్యోతి – సభ్యురాలు

5. బుర్రి వెంకటయ్య – సభ్యుడు

6. రామావత్ వస్యా – సభ్యుడు

7. ధనావత్ సైదులు – సభ్యుడు

8. ఉట్కూరి సైదులు – సభ్యుడు

9. కర్నం రామ నర్సయ్య – సభ్యుడు

10. పల్లె కాశయ్య – సభ్యుడు

11. గడ్డం ప్రియాంక – సభ్యురాలు

12. కత్తి శ్రీనివాస్ రెడ్డి – సభ్యుడు

13. పోల విశ్వనాథం – సభ్యుడు

14. రెబ్బె రమేష్ – సభ్యుడు

అధికారిక సభ్యులు

15. జిల్లా మార్కెటింగ్ అధికారి, సూర్యాపేట.

16. సహాయ వ్యవసాయ సంచాలకులు, హుజూర్‌నగర్.

17. మున్సిపల్ చైర్మన్, నేరేడుచర్ల.

నూతన పాలకవర్గంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌తో పాటు 12 మంది ఇతర సభ్యులు, ముగ్గురు అధికారిక సభ్యులకు స్థానం కల్పించారు.

వ్యవసాయ, సహకార శాఖ ఏపీసీ అండ్ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్ పేరుతో ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతన పాలకవర్గ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ అసాధారణ గెజిట్‌లో ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం నియామకానికి సహకరించిన రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయడం ప్రధాన లక్ష్యాలుగా నూతన పాలకవర్గం పనిచేయనుంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button