ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత

గోవాలో తీవ్ర గుండెపోటుతో మృతి.. 45 నిమిషాల పాటు వైద్యుల ప్రయత్నం విఫలం

హైదరాబాద్, అక్టోబర్ 8 | నిజం న్యూస్:

ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో తీవ్ర కార్డియాక్ అరెస్ట్కు గురైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సీపీఆర్ అందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5.20 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మణిపాల్ ఆసుపత్రి చీఫ్ ఆఫ్ ఆంకాలజీ విభాగం డాక్టర్ శేఖర్ సాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. నానా పటేకర్‌కు తీవ్ర గుండెపోటు వచ్చింది. నిరంతరంగా 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను పునరుద్ధరించలేకపోయారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

అసలు పేరు విశ్వనాథ్ పటేకర్

నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. ఆయన 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్-జంజీరాలో జన్మించారు. 1978లో ‘గమన్’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. నాలుగు దశాబ్దాలకు పైగా హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేశారు.

‘పరిందా’, ‘ప్రహార్’, ‘క్రాంతివీర్’, ‘తిరంగా’, ‘ఖామోషీ’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా కూడా నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు.

ఎన్నో అవార్డులు.. ప్రత్యేక గుర్తింపు

నానా పటేకర్ తన నటనకు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సహా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2013లో కళారంగంలో ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీతో సత్కరించింది.

తీవ్రమైన భావోద్వేగాలను, విభిన్నమైన పాత్రలను, శక్తివంతమైన సంభాషణలను తన ప్రత్యేక శైలిలో ఆవిష్కరించిన నానా పటేకర్.. భారతీయ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఆయన మృతితో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, అభిమానులు నానా పటేకర్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button