కరెంటు కోతలతో వరి పైర్లు ఎండుతున్నాయ్.. రైతుల ఆగ్రహం

కోదాడ సబ్‌స్టేషన్‌ ఎదుట అఖిలపక్ష రైతు సంఘాల ధర్నా.. ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్-

కోదాడ, నిజం న్యూస్:

,విద్యుత్‌ కోతల కారణంగా వరి పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో కోదాడ సబ్‌స్టేషన్‌ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. పంటలను కాపాడేందుకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని, విద్యుత్‌ కోతల కారణంగా ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పుడు కోదాడ ప్రాంత రైతుల పట్ల ఎందుకు పక్షపాతం చూపుతున్నారని ప్రశ్నించారు. విద్యుత్‌ కోతలతో సాగునీరు అందక వరి పైర్లు ఎండిపోతున్నాయని, వెంటనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించి పంటలను కాపాడాలని కోరారు.

నిరసనలో భాగంగా రైతులు ట్రాక్టర్లను సబ్‌స్టేషన్‌ వద్ద అడ్డుగా నిలిపి ఉద్యోగులు లోనికి వెళ్లకుండా ఆందోళన చేపట్టారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button