రూ.20 వేల లంచం తీసుకుంటూ డీఐఈఓ ఏసీబీకి చిక్కిన వైనం!

సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌పై ఏసీబీ వల

సెప్టెంబర్ 9, 2026 | నిజం న్యూస్

సంగారెడ్డి: జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DIEO) రమావత్ గోవింద్ రామ్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా డీఐఈఓ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫిర్యాదుదారుడికి చెందిన వికాస్ వొకేషనల్ జూనియర్ కాలేజీ ప్రొవిజనల్ అఫిలియేషన్ పొడిగింపు, రెన్యూవల్‌కు సంబంధించిన తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించేందుకు డీఐఈఓ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

మొదటగా రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన అధికారి ఇప్పటికే రూ.30 వేలు స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. మిగిలిన రూ.20 వేలను స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.20 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ విధులను అక్రమంగా, నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తులో ఉంది.

శ్రీనివాస్ నాయక్

స్టేట్ బ్యూరో,నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button