హుజూర్నగర్లో పేదలకు ఉపాధి కల్పించిన జమాతే ఇస్లామీ హింద్..!
బతుకుదెరువు భారమైన వారికి భరోసా కల్పించడమే సంస్థ లక్ష్యం.. మ్యారేజ్ బ్యూరో మజీద్..!

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడంలో జమాతే ఇస్లామీ హింద్ సంస్థ తన ఉదారతను చాటుకుంది.
హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు మ్యారేజ్ బ్యూరో మజీద్ ఆధ్వర్యంలో ఇద్దరు మహిళలకు స్వయం ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు.
శ్రీనగర్ కాలనీకి చెందిన ముంతాజ్కు కుట్టు మిషన్,టీచర్స్ కాలనీకి చెందిన షేక్ జాన్బికి బత్తాయి జ్యూస్ మిషన్ను పంపిణీ చేశారు.
పేదలు గౌరవప్రదంగా జీవించేలా ఉపాధి మార్గాలు చూపిన ఆయనను స్థానిక ముస్లిం పెద్దలు,యువకులు అభినందించారు.



