90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రణాళికలు

యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోలు పై మంత్రి మాట్లాడుతూ యాసంగి సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని అంచనా వేయడం జరిగిందని, దీనిలో ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించిందని, దీనిలో 30 లక్షల టన్నుల సన్న రకం, 60 లక్షల టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని. ఇందుకు గాను 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని, 16 కోట్ల గన్ని బ్యాగులు కూడా సిద్ధం చేశామని, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాల కోసం జిల్లా కలెక్టర్లకు నిధులు మంజూరు చేశామని, ఒక్కొక్క కేంద్రానికి ఒక సూపర్వైజర్ ఉంటారని, పిపిసి సెంటర్లను ఇంకా వేగవంతం చేస్తామని మంత్రి అన్నారు.

సూర్యాపేట ఏప్రిల్ 8:

 

రాష్ట్రానికే మోడల్ కాలనీ తలమానికం

 

పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ, పైరవీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆస్కారం ఉండదు

అనర్హులకు అవకాశం ఇస్తే చర్యలు కఠిన చర్యలు

 

లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయండి

 

తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక

 

మోడల్ కాలనీలో 10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, మరో 10 కోట్లతో అంగన్ వాడి కేంద్రం, కమ్యూనిటీ హాల్ తో పాటు మౌలిక సదుపాయాల కల్పన

 

రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి…

 

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట సమీపంలో 116 ఎకరాల విస్తీర్ణంలో 2,160 సింగిల్ బెడ్ రూమ్ లతో 200 కోట్ల తో నిర్మించిన మోడల్ కాలనీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం కానుందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

 

బుధవారం  ఆయన మోడల్ కాలనీని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అప్పటికే 90 శాతం మేర పనులు పూర్తి అయినవని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మోడల్ కాలనీని తీర్చిదిద్దుతు న్నామని అందులో భాగంగానే భూమి కొనుగోలుకు చేసిన వ్యయం మినహాయించి మొత్తంగా ఒక్క నిర్మాణానికే 125 కోట్లు వెచ్చించడంతో పాటు మరో 20 కోట్లు తాజాగా మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు.

10 కోట్లతో మోడల్ కాలనీలో తెలంగాణా పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు మరో 10 కోట్లతో ఇదే కాలనీలో అంగన్ వాడి కేంద్రం, కమ్యూనిటీ హల్, క్రీడా ప్రాంగణం, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పట్లతో పాటు సి.సి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ మాసంతానికి మోడల్ కాలనీ ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన సూచనా ప్రాయంగా వెల్లడించారు.

 

ప్రారంబొత్సావానికి ముందే లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అందులో మొదటి విడతలో అధికారులు 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారని ఆయన ప్రకటించారు. అయితే అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉంటుందని మంత్రి ప్రకటించారు

హుజుర్నగర్ కే ఐకాన్ గా నిలబడ నున్న ఈ మోడల్ కాలనీ లబ్ధిదారుల ఎంపికలో అపోహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని నిష్పక్షపాతంగా ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనర్హులను సిఫార్సు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుల జాబితాను ఒకటికి రెండు సార్లు నిశితంగా పరిశీలించాలని జాబితాలో ఒక్క అనర్హుడి పేరు ఉన్నా మోడల్ కాలనీ నిర్మాణ సంకల్పం దెబ్బ తింటుందని ఆయన అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

నిజ నిజాలు తెలుసు కోకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించి అపోహలు రేకిత్తీస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

అధికారులు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితా పూర్తిస్థాయిలో పారదర్శకంగా ఉంటుందని ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారం ఉండదని ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి అన్నారు.

 

తదుపరి యాసంగి సీజన్లో వరి ధాన్యం కొనుగోలు పై మంత్రి మాట్లాడుతూ యాసంగి సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని అంచనా వేయడం జరిగిందని, దీనిలో ప్రభుత్వం 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించిందని, దీనిలో 30 లక్షల టన్నుల సన్న రకం, 60 లక్షల టన్నుల దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని. ఇందుకు గాను 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగిందని, 16 కోట్ల గన్ని బ్యాగులు కూడా సిద్ధం చేశామని, జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాల కోసం జిల్లా కలెక్టర్లకు నిధులు మంజూరు చేశామని, ఒక్కొక్క కేంద్రానికి ఒక సూపర్వైజర్ ఉంటారని, పిపిసి సెంటర్లను ఇంకా వేగవంతం చేస్తామని మంత్రి అన్నారు.

తదుపరి మంత్రి హుజూర్నగర్ మార్కెట్ యార్డ్ లో దాన్ని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కొనుగోలు కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, క్లీన్ యంత్రాలు, ధాన్యం డ్రై వాష్ చేయు యంత్రాలు, తార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని మంత్రి అన్నారు.

 

అంతకుముందు మంత్రి క్యాంప్ కార్యాలయం నందు 437 మందికి 1 కోటి 80 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి, సిఎంఆర్ చెక్కులు అందజేశారు అలాగే 259 మంది అంగన్వాడి టీచర్లకు మొబైల్ ఫోన్లు అందజేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button