యుద్ధ సెగ..’కండోమ్’ కష్టాలు.. భారీగా పెరగనున్న ధరలు!
ముడిసరుకు లభ్యత తగ్గడం, రవాణా ఇబ్బందుల వల్ల వీటి ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఫార్మా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు నిత్యావసరాలకే కాకుండా కండోమ్‌ల తయారీపై కూడా పడింది. ముడిసరుకు లభ్యత తగ్గడం, రవాణా ఇబ్బందుల వల్ల వీటి ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఫార్మా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ముడి సరుకు కొరతతోకండోమ్ల తయారీలో లూబ్రికేషన్ కోసం వాడే సిలికాన్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది.
అమ్మోనియా ధరల పెరుగుదల: కండోమ్ చిరిగిపోకుండా ఉండేందుకు వాడే అమ్మోనియా ధరలు ఏకంగా 40% నుంచి 50% వరకు పెరిగాయి.భారత్ తన అవసరాలకు కావాల్సిన 86% అమ్మోనియాను గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు తయారీ సంస్థలు తెలిపాయి.
తయారీ వ్యయం విపరీతంగా పెరగడంతో HLL లైఫ్ కేర్, మాన్‌కైండ్ ఫార్మా వంటి దిగ్గజ సంస్థలు త్వరలోనే ధరల పెంపును అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి.
యుద్ధం కారణంగా ముడిసరుకు లభ్యత క్లిష్టంగా మారడం వినియోగదారులపై అదనపు భారానికి దారితీస్తోంది.



