అత్యాచారం కేసులో నిందితునికి 7 ఏళ్ల జైలు శిక్ష 

మహిళలు, చిన్నారుల భద్రత మా మొదటి ప్రాధాన్యత. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి

జిల్లా ఎస్పీ సునిత రెడ్డి,

 

నేరం రుజువై కఠిన శిక్ష విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

 

మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవు

 

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో మార్చి 24 (నిజం చెపుతాం)

 

గోపాల్‌పేట్ మండలం, ఏదుల గ్రామం 31-10-2023 రాత్రి, బాధిత మైనర్ బాలిక తన పొలం వద్ద మోటర్ ఆఫ్ చేసి ఇంటికి తిరిగి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన నిందితుడు సింగం శివుడు (తండ్రి: పుల్లయ్య) బలవంతంగా ఆమెను పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.

బాధితురాలు ధైర్యంగా ప్రతిఘటించి అక్కడి నుండి తప్పించుకొని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గోపాల్ పేట్ ఎస్సై, వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించి సంఘటన స్థల పరిశీలించి సాంకేతిక ఆధారాల సేకరణ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు.

కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు

ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ పి. శ్రీనివాసాచారి బలమైన వాదనలు వినిపించగా, కేసు పూర్వాపరాలను పరిశీలించిన గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత నిందితునికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పాటు 20,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు

ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన ప్రస్తుత ఎస్సై జగన్, కోర్టు లైజనింగ్ అధికారి, కె. సత్యం

కోర్టు కానిస్టేబుల్ రమేష్ నాయక్,పబ్లిక్ ప్రాసిక్యూటర్,

అందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల భద్రత మా మొదటి ప్రాధాన్యత. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి – పోలీసు శాఖ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని సమాజంలో నేరాలకు తావులేకుండా అందరూ చట్టానికి లోబడి సహకరించాలి.”

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button