అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం భారీగా పట్టివేత…
మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ స్థాయిలో నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా, కురవి,(నిజం చెపుతాం), మార్చి, 19 :
మహబూబాబాద్ జిల్లాలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ స్థాయిలో నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ సారాయి తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని లారీ ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీసులు చర్యలు చేపట్టారు.
కురవి శివారు సోమ్లా తండా వద్ద లారీని అడ్డగించి తనిఖీ చేయగా,అందులో సుమారు రూ.8 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం,10 క్వింటాళ్ల పట్టికను గుర్తించారు.
వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు.ఈ ఘటనలో గుగులోత్ సుమన్ (మహబూబాబాద్), ఆరెపల్లి మధు,బొల్లా విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.



