హుజూర్ నగర్ లో యధేచ్ఛగా ఫుట్‌ పాత్ ఆక్రమణలు…అక్రమ కట్టడాల వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిది..?

పట్టణంలోని రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై మున్సిపల్ ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తూ పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్‌ల తరహాలో నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. కేవలం రేకుల షెడ్లకే పరిమితం కాకుండా, ఏకంగా ఫుట్‌పాత్‌లపైనే బోరు బావులు వేస్తుండటం గమనార్హం. చలువ రేకులు పరిచి ఫుట్‌పాత్‌ పూర్తిగా కబ్జా చేశారు.

చలువ రేకులతో దర్జాగా కబ్జా..!

*ఫుట్ పాత్ పై బోరు బావి వేయడానికి అనుమతి ఎవరిచ్చారు*..?

*భవిష్యత్తులో డ్రైనేజీ పనులకు…రోడ్డు విస్తరణకు ..బోరు బావులు అడ్డంకిగా మారవా*..?

*ఫుట్‌ పాత్ లపై హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘన*..!

హుజూర్ నగర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్ ఆక్రమణలు వివాదాస్పదంగా మారాయి. సామాన్య పాదచారుల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి నిర్మించిన ఫుట్‌పాత్‌లు ఇప్పుడు కొందరి స్వార్థానికి బలైపోతున్నాయి. అధికారుల కళ్లముందే నిబంధనలకు తిలోదకాలిస్తూ యధేచ్ఛగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి.

*ప్రధాన రహదారిపై ఆక్రమణల పర్వం*…!

పట్టణంలోని రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై మున్సిపల్ ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తూ పెద్ద ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్‌ల తరహాలో నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. కేవలం రేకుల షెడ్లకే పరిమితం కాకుండా, ఏకంగా ఫుట్‌పాత్‌లపైనే బోరు బావులు వేస్తుండటం గమనార్హం. చలువ రేకులు పరిచి ఫుట్‌పాత్‌ పూర్తిగా కబ్జా చేశారు.

*కోర్టు వివాదంలో ఉన్నా ఆగని నిర్మాణ పనులు*..?

గతంలో పబ్లిక్ క్లబ్ ముందు భాగంలో ఉన్న స్థలం కోర్టు వివాదంలో ఉండగా, అక్కడ తాత్కాలిక షాపుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. ఇప్పుడు ఆ స్థలంలోనే పక్కా భవనాలను నిర్మిస్తూ ఒక్కో షాపును నెలకు రూ. 20,000 నుండి రూ. 30,000 వరకు భారీ అద్దెలకు ఇస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత లాభం కోసం వాడుకుంటున్నా అధికారులు మౌనంగా ఉండటం వెనుక అంతర్యమేమిటని ప్రస్తుతం హుజూర్ నగర్ చర్చ జరుగుతోంది.

*అధికారుల మౌనం.. అండ ఎవరిది*…?

హుజూర్ నగర్ పట్టణ మెయిన్ రోడ్ లో భారీ ఆక్రమణలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు

కళ్లు మూసుకున్నారా లేక చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ కట్టడాల వెనుక ఉన్న ‘అదృశ్య హస్తం’ ఎవరిది కోట్ల రూపాయల ప్రజా ఆస్తులు హారతి కర్పూరం అవుతుంటే సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

*కోర్టు ఆదేశాల ఉల్లంఘన*..!

పాదచారుల హక్కులను కాపాడాలని, ఫుట్‌పాత్ ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ హైకోర్టు పదేపదే ఆదేశిస్తున్నా, మున్సిపల్ అధికారులు

ఆ ఆదేశాలను తుంగలో తొక్కడం విస్మయానికి గురి చేస్తోంది.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button