Cybercrime SI in the ACB net: ఏసీబీ వలలో సైబర్ క్రైమ్ ఎస్ఐ…రూ. 1,00,000/- లంచం తీసుకుంటుండగా అరెస్ట్
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్ , జాతవత్ బాబు నాయక్, ఒక సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS (గతంలో సెక్షన్ 41-A Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు.

Cybercrime SI in the ACB net: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్ , జాతవత్ బాబు నాయక్, ఒక సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా సెక్షన్ 35 BNSS (గతంలో సెక్షన్ 41-A Cr.P.C.) కింద నోటీసు ఇచ్చేందుకు రూ. 1,00,000/- లంచం డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు అందినట్లు తెలిపారు.
ఫిర్యాదుదారుడిని నుండి లంచం తీసుకుంటుండగా ఎల్.బి. నగర్ చౌరస్తా వద్ద తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వారిని పట్టుకున్నారు.
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలుపుతున్నారు.



