T20 WORLD CUP : టీ20 వరల్డ్ కప్ లో హైలైట్స్, రికార్డులివే…?
గత రెండు నెలలుగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆదివారం ఫైనల్ లో న్యూజిలాండ్ పై ఇండియా గెలవడంతో ముగిసిపోయింది. అయితే రెండు నెలలుగా జరిగిన ఈ వరల్డ్ కప్ లో హైలైట్స్, రికార్డులేమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం.

T20 WORLD CUP : గత రెండు నెలలుగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆదివారం ఫైనల్ లో న్యూజిలాండ్ పై ఇండియా గెలవడంతో ముగిసిపోయింది. అయితే రెండు నెలలుగా జరిగిన ఈ వరల్డ్ కప్ లో హైలైట్స్, రికార్డులేమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం.
అత్యధిక వికెట్లను సాధించింది..ఇండియా ఆటగాడు బుమ్రా..14 వికెట్లను సాధించాడు.

ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 110 పరుగులు…కెనడా ఆటగాడు యువరాజ్ శర్మ సాధించాడు.

ఫాస్టెస్ట్ సెంచరీని న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ 33 బంతుల్లో సాధించాడు.

అత్యధిక సెంచరీలను పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ సాధించాడు. ఇతడు 2 సెంచరీలు చేసాడు. ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులను చేసింది …పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ నే. ఇతను 383 పరుగులను చేసాడు. అత్యధిక ఫోర్లను కూడా పాకిస్తాన్ కు చెందిన ఫర్హాన్ నే కొట్టాడు. ఇతను 37 ఫోర్లను కొట్టాడు.

అత్యధిక హఫ్ సెంచరీలను న్యూజిలాండ్ కు చెందిన టిమ్ సైఫర్డ్ సాధించాడు. ఇతను 4 హాఫ్ సెంచరీలను సాధించాడు.

అత్యధిక సిక్సర్లను భారత్ కు చెందిన సంజూ సాంమ్సన్ సాధించాడు. ఇతను 24 సిక్స్ లను కొట్టాడు.

20 పరుగులకు 5 వికెట్లను వెస్టిండీస్ కు చెందిన రోమారియో షెపర్డ్ తీసి టీ20 వరల్డ్ కప్ లో బెస్ట్ బౌలింగ్ రికార్డును నెలకొల్పాడు.




