టమాట ధర ఢమాల్… గొర్రెలకు, మేకలకు ఆహారంగా టమాట పంట
కష్టపడి పండించిన పంట, దిగుబడి లేక, రైతులు ఏం చేయలేక, ఏం చేయలేక, కంటతడి పెడుతూ, ఎవరికి చెప్పుకోలేక, తమకు తామే మనస్థాపానికి గురై, గొర్రెలను మేకలను, టమాటా పంటను మేపుతున్నారు. టమాట రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

టమాటా పంట పెట్టిన రైతు విలవిల.
. ధర లేక రైతు హరిగోశ.
. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన టమాట ధర.
. టమాటా రైతులకు పూర్తిగా తీవ్ర నష్టం.
దుబ్బాక ఇన్చార్జ్ 03( నిజంచెపుతాం)
సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండలం, పెద్ద చెప్పాలా గ్రామంలో, అత్యధికంగా రైతులు,కూరగాయల పంటలు ఎక్కువగాసాగు చేస్తారు. రైతులు ఎంతో కష్టపడి కూరగాయ పంట సాగు చేయడం జరిగింది.
ఎంతో కష్టపడి పంటను, కన్న బిడ్డ లెక్క సాధుకుంటూ, రైతులు అప్పు తెచ్చి మరి, పంట సాగు కోసం ఎన్నో రకాల మందులను పంటకు వేస్తారు. మందులకు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్న, వెనకడుగు వేయకుండా రైతులు, తమ కష్టాన్ని నమ్ముకుంటూ, పంటను సాగు చేశారు.
సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి, మార్కెట్లో ధర పడిపోవడంతో, రైతులకు ఏం తోచక, టమాట ధర వచ్చి పది రూపాయలకు మూడు కిలోలు, ఎంతో కష్టపడి సాగు చేసిన పంటకు, కనీస మద్దతు ధర మార్కెట్లో లేకపోవడంతో, తీవ్రస్థాయిలో రైతులు ఆవేదన గురయ్యారు.
పంట పండించిన పండించకపోయిన ఒకటే అని, రైతులు తీవ్ర మనస్థాపానికి గురై, కష్టపడి పండించిన పంట, దిగుబడి లేక, రైతులు ఏం చేయలేక, ఏం చేయలేక, కంటతడి పెడుతూ, ఎవరికి చెప్పుకోలేక, తమకు తామే మనస్థాపానికి గురై, గొర్రెలను మేకలను, టమాటా పంటను మేపుతున్నారు. టమాట రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



