పని కొచ్చే ప్రభుత్వ మందులు పడబోశారు 

గూడూరులోని ఐ సి డి ఎస్ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఒక అంగన్వాడి కేంద్రంగా చెప్పుకునే భవనం ముందు ( ప్రస్తుతం దానిని ఉపయోగించడం లేదు ) ఈ మందులు పడబోసి ఉండడం గమనార్హం

ఎవరిదో ఈ ఘనకార్యం

డేట్ ఎక్స్పైరీ కాకముందే విలువైన ప్రభుత్వ మందులను పడబోసిన పరిస్థితి గూడూరులో నెలకొని ఉంది. అది కూడా ప్రజలు నిత్యం తిరుగాడే బహిరంగ ప్రదేశంలో పడవేయడం ఆశ్చర్యకరం.

గూడూరులోని ఐ సి డి ఎస్ కార్యాలయానికి సమీపంలో ఉన్న ఒక అంగన్వాడి కేంద్రంగా చెప్పుకునే భవనం ముందు ( ప్రస్తుతం దానిని ఉపయోగించడం లేదు ) ఈ మందులు పడబోసి ఉండడం గమనార్హం… పొడబోసిన వాటిల్లో ఓ ఆర్ ఎస్ పాకెట్లు, పారాసిటమాల్ టాబ్లెట్లు, సిరప్ లు తదితర పలు రకాల మందులు పెద్ద మొత్తంలో ఉన్నాయి.

ఆ మందుల ఎక్స్పైరీ గడువు మార్చి, ఏప్రిల్ 2027 మాసాల వరకు కూడా ఉండడం గమనార్హం. కాగా వీటిపై తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అని రాసి ఉంది… ఎక్స్పైరీ డేట్ రాకముందే ఇవి ఎందుకు పడబోసారు అన్న విషయం తెలియాల్సి ఉంది…

వీటిని ఐసిడిఎస్ కార్యాలయం నుండి తెచ్చి పడవేశారా లేక అంగన్వాడీ కేంద్రాల నుండి తెచ్చి పడవేశారా అన్నది అధికారులు దృష్టి సారిస్తే కానీ బయటకు రాదు….

ప్రభుత్వం సరఫరా చేసిన ఇలాంటి విలువైన మందులు అవసరానికి ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా పడవేయడం విచారకరం. మందులు పడవేసిన సీన్ చూస్తే ఒకటి రెండు రోజుల క్రితమే పడేసినట్లు కనిపిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button