ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి.‎

స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమం పై ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి.

స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ కార్యక్రమం పై ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్.

భూపాలపల్లి మహాదేవపూర్ మీ 11( నిజం న్యూస్)

భారత ఎన్నికల సంఘం త్వరలో ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో, ఓటర్ల జాబితా ప్రక్రియ వేగవంతం చేసి ఈ నెల ఆఖరులోగా 90 శాతం పురోగతి సాధించాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి. సోమవారం రోజు హైదరాబాద్ లోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లా ఎన్నికల అధికారులు విద్య అధికారులు ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణలో భాగంగా ఐ డి ఓ సి వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ రిటర్నింగ్ అధికారి హరికృష్ణ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ మ్యాపింగ్ కార్యక్రమానికి సహకారం అందించుటకు రెసిడెన్షియల్ అసోసియేషన్ లను, అలాగే గీటెడ్ కమ్యూనిటీ భాగ్యస్వామ్యం చేయాలని అన్నారు ఎన్నికల ప్రధాన కార్యదర్శి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్లను సంప్రదించి స్వచ్ఛందంగా తమ వివరాలు మ్యాపింగ్ చేయించుకోవాలని స్పష్టం చేశారు.బి ఎల్ ఓ ల, ను సంప్రదింపు వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని, సీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలపడం జరిగింది. బి ఎల్ ఓ లు సూపర్వైజర్లు సమన్వయంతో గేటెడ్ కమ్యూనిటీ స్లం ప్రాంతాలను సందర్శించి స్థానిక ప్రతినిధులను కలుపుకొని మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి, అలాగే హెల్ప్ డిస్క్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు స్వయం సహాయక సంఘాలు రేషన్ దుకాణాలు, ఉద్యోగ సంఘాలను కూడా ఈ ప్రక్రియలు భాగ్యస్వామ్యం చేయాలని సూచించారు. మరణించిన వలస వెళ్లిన లేదా శాశ్వతంగా చిరునామా మార్చుకున్న ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి విధి విధానాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నియోజకవర్గంలో విఐపి మరియు విఐపి ల ఓటర్ల మ్యాపింగ్ కూడా పూర్తి చేయాలని ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో ఈ ఆర్ ఓ లను సమావేశాలు నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ పురోగతిని సమీక్షించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button