అక్రమాల పక్కదారి కొరకు కొనుగోలు కేంద్రాల సందర్శన.?
అధికారి సందర్శన సరే, లారీలు ఎక్కడ.! రైతులకు పక్కదారి, కాంట్రాక్టర్ మెప్పు కొరకు హై డ్రామా.!? 8 వేల చొప్పున 10 లారీలు ధాన్యం రవాణా కొరకు అద్దె,? ఇంత జరిగినా కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.!?

అక్రమాల పక్కదారి కొరకు కొనుగోలు కేంద్రాల సందర్శన.?
అధికారి సందర్శన సరే, లారీలు ఎక్కడ.!
రైతులకు పక్కదారి, కాంట్రాక్టర్ మెప్పు కొరకు హై డ్రామా.!?
8 వేల చొప్పున 10 లారీలు ధాన్యం రవాణా కొరకు అద్దె,?
ఇంత జరిగినా కాంట్రాక్టర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.!?
నాలుగు శాఖలకు 50 లక్షలు, ముట్ట చెప్పినట్టు సమాచారం.!?
ట్రాన్స్పోర్ట్ ముసుగులో భారీ అక్రమాలను బయట పెట్టిన “నిజం న్యూస్”
కొత్త కాంట్రాక్టర్ నియామకంతోనే ధాన్యం రవాణా కు సాధ్యం.
ధాన్యం కొనుగోలు రవాణా కై ప్రత్యేక అధికారిని నియమించాల్సిన అవసరం.
సబ్ డివిజన్ ,ధాన్యం రవాణా వ్యవహారంపై చీఫ్ సెక్రటరీ దృష్టి సాధించాలి. రైతులు.
మహాదేవపూర్,భూపాలపల్లి: మే 22( నిజం న్యూస్)
మహాదేవపూర్ మండలం తో పాటు కాటారం సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో దాన్యం కొనుగోలు రవాణా వ్యవహారం, పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారి, సుమారు 25 నుండి 30 రోజులుగా, ధాన్యం రవాణా చేయకుండా, కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ ఉండడం, రైస్ మిల్లులకు ధాన్యం రవాణా విషయంలో రైతుల నుండి, బస్తా చొప్పున డబ్బులు డిమాండ్ చేయడం, లేదంటే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి పరిమితం చేయడంతో, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అక్రమాల వ్యవహారం, తెరపైకి రావడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అక్రమాలను కప్పిపుచ్చుటకు, ప్రభుత్వ ఆదేశాలను సైతం లెక్కచేయకుండా అధికారులు కాంట్రాక్టర్ కు వత్తాసు పలుకుతూ, ధాన్యం రవాణా కొరకు లారీలను అడ్డదారిగా తరలించుటకు ప్రయత్నాలు చేయడం, అవి విఫలం కావడం. ధాన్యం రవాణా చేయకుండా ఉండడంతో ఆగ్రహించిన రైతులు ధాన్యం బస్తాలతో రాస్తారోకో, పలువురు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంటామని, పురుగుల మందు డబ్బాతో, తమ ఆవేదనను వెళ్ళవచ్చుకున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా, కొందరు అధికారులు, ధాన్యం రవాణా విషయం లో కాంట్రాక్టర్ అక్రమాలను కప్పిపుచ్చుటకు అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించడం, అక్కడ రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో, సరి సరి అంటూ అధికారులు వెళ్లడం ఆశ్చర్యానికి దారితీసింది. అధికారులు కాంట్రాక్టర్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి, సబ్ డివిజన్ పరిధిలో రైతులు మరియు ప్రజల వద్ద, చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తపరిచేలా వ్యవహరిస్తున్నారు అధికారులు.
అధికారి సందర్శన సరే, లారీలు ఎక్కడ.!
వరి ధాన్యం కొనుగోలు మరియు రవాణా ప్రక్రియ ప్రారంభమై 35 రోజులు దాటుతున్న క్రమంలో, అధికారులు రవాణా విషయంలో, ఎందుకు స్పందించలేదు, ప్రతిసారి కొన్ని సందర్భాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు వచ్చి చూడడం జరిగినప్పటికీ ఇప్పటివరకు, ధాన్యం రవాణా ఎందుకు చేయలేదు, గతంలో సందర్శించిన విధంగానే ఈ సందర్శన కూడా, అలాగే వ్యవహరించడం జరుగుతుంది, కానీ ఈ సందర్శన వెనుక మాత్రం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అక్రమాల వ్యవహారాన్ని, కప్పిపుచ్చుటకు అధికారులు సందర్శన పేరుతో రైతులకు మరియు ప్రజలకు తప్పుదారి పట్టించుటకు, కొనుగోలు కేంద్రాల తనిఖీ అనే కొత్త డ్రామాను తెర లేపడం జరిగిందని అంటున్నారు రైతులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అసలు భాగవతం బయటపడి సుమారు ఐదు రోజులు గడుస్తున్న, అధికారులు సందర్శన పేరుతో కొనుగోలు కేంద్రాలకు రావడం సరి కాని, ధాన్యం రవాణా కొరకు లారీలు ఎక్కడ, అధికారుల సందర్శన అవసరం లేదు ముందుగా ధాన్యం బస్తాలకు రవాణా చేయుటకు కాంట్రాక్టర్ లారీలు అవసరమని అంటున్నారు రైతులు.
8 వేల చొప్పున 10 లారీలు ధాన్యం రవాణా కొరకు అద్దె,?
సమయానికి ధాన్యం రవాణా చేయకుండా, కాంట్రాక్టర్ లారీల సదుపాయం ఏర్పాటు చేయకుండా, అధికారుల ప్రోత్సాహంతో తన అక్రమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్న క్రమంలో, అసలు కథ బయటపడడంతో, తాజాగా శుక్రవారం రోజు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ జిల్లా నుండి సుమారు 10 లారీల వరకు, అది కూడా 7000 నుండి 8000 వేల రూపాయల అద్దె కిరాయి కి ఒప్పించుకొని ధాన్యం రవాణా కొరకు రప్పించుకున్నట్లు సమాచారం. నాలుగు మండలాల్లో, ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, ఈ 10 దారిలో ధాన్యం రవాణా సాధ్యమవుతుందా, సుమారు 30 రోజులుగా ఉన్న ధాన్యం 10 లారీల్లో ఎలా రవాణా కు సాధ్యమవుతుంది. 80 నుండి 100 వరకు టెండర్లు లారీలు చూపెట్టిన కాంట్రాక్టర్, ఇప్పుడు జిల్లా నుండి పది లారీలు అది కూడా తక్కువ అద్దెతో, లారీలను ధాన్యం రవాణా కొరకు రప్పించుకోవడం. జరిగింది అని విశ్వనీయ సమాచారం. కాంట్రాక్టర్ వద్ద లారీలే లేనప్పుడు, అధికారులు చర్యలు తీసుకొని తక్షణమే కొత్త టెండర్ ను పిలిచి, ఓపెన్ టెండర్ కార్యక్రమాన్ని నిర్వహించి ఇతర లారీలు ఉన్న కాంట్రాక్టర్ కు అప్పగించాల్సి ఉండేది, కానీ అధికారులు అలా చేయకుండా, లారీలు లేని కాంట్రాక్టర్ తో సుమారు 35 రోజులపాటు ధాన్యం రవాణా చేయకుండా ఎందుకు వేచి చూశారు అనేది ప్రశ్న. మరోవైపు లారీలు లేని కాంట్రాక్టర్ బూచిగా చూపెట్టిన ఆర్సీలు, అంతా ఒక బూటకం అని, స్పష్టంగా కనబడుతుంది. కానీ ఈ వ్యవహారం వెనుక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, ప్రధాన నాలుగు శాఖలకు ఆయా శాఖల విధులను బట్టి, ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి నాలుగు శాఖలకు కలిపి సుమారు 50 లక్షల రూపాయల వరకు ముట్ట చెప్పినట్లు సమాచారం. అందుకే ఓపెన్ టెండర్ కాకుండా సింగిల్ టెండర్ చేసి లారీలు లేని కాంట్రాక్టర్ కు గత కొన్నేళ్లుగా, కాంట్రాక్ట్ అందించడం వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే అని, తక్కువ ధరకు అద్దె లారీలు తీసుకువచ్చి, మరోవైపు రైతుల నుండి బస్తాకు ఇంత రేటు ఇస్తేనే ధాన్యం రవాణా లాంటి అరాచకాన్ని, అధికారులు చూసి చూడనట్టుగా ఉండడానికి కూడా కాంట్రాక్టర్ నుండి అందిన భారీ ముడుపులే కారణమని ఈ తతంగమంతా రైతులకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని చెప్పుకోవడం విశేషం.
ట్రాన్స్పోర్ట్ ముసుగులో భారీ అక్రమాలను బయట పెట్టిన “నిజం న్యూస్”
మహదేవపూర్ మండలం తో పాటు కాటారం సబ్ డివిజన్ పరిధిలో, వడ్ల కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం రవాణా ట్రాన్స్పోర్ట్ ముసుగులో భారీ అక్రమాలను,” నిజం న్యూస్ “గత ఐదు రోజుల నుండి వరుస కథనాలతో, తెరపైకి తీసుకురావడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ వ్యవహారం వెనుక, రోజుకు ఒక కొత్త కోణం వెలుగులోకి రావడం, కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రవాణా కాకుండా పెద్ద మొత్తంలో నిలిచిన ధాన్యం, చెప్పుకోలేని పరిస్థితిలో రైతులకు, “నిజం న్యూస్” అండగా నిలబడి, కాంట్రాక్టర్, అధికారుల లోపకారి ఒప్పందాన్ని బయటికి తీయడంతో, తమ వడ్లు, రవాణా కాకుండా ఇక వర్షానికి తడిసి బుద్ధి కోత పేరుతో, పెట్టిన పెట్టుబడి కి కూడా నోచుకోకుండా, రైతులుగా తమ బతుకులు ఇలా మారాయని ఏమిటి అని ఆ దేవునికి వేడుకుంటున్న క్రమంలో, “నిజం న్యూస్” ఆ రైతులకు అండగా నిలిచి, తమ అక్షర పోరాటాన్ని ప్రారంభించింది, “నిజం న్యూస్” కథనాలతో కాంట్రాక్టర్ మరియు అధికారులు,లోలోపల ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో, కొనుగోలు కేంద్రాల వద్ద తనిఖీలు, కాంట్రాక్టర్ జిల్లా కేంద్రం నుండి, అద్దె లారీలు తెప్పించేలా చేసింది” నిజం న్యూస్” కానీ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు 10 లారీల్లో ధాన్యం రవాణా సాధ్యం కానీ పరిస్థితి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సబ్ డివిజన్ పరిధిలో ధాన్యం రవాణా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వ్యవహారంపై తక్షణమే, ప్రత్యేక అధికారి నియమించి, ధాన్యం రవాణా పర్యవేక్షణ చేపట్టిన ఒక అధికారికి బాధ్యతలు అప్పగించి, తక్షణమే కొత్త కాంట్రాక్టర్ తో పాటు సుమారు 50 నుండి 70 లారీలు, అందుబాటులోకి తెచ్చి, సబ్ డివిజన్ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే రవాణా చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు రైతులు. మరోవైపు సుమారు 35 రోజులపాటు లారీలు లేకుండా కాంట్రాక్ట్ దక్కించుకొని రైతులను ఇబ్బందులకు గురిచేసిన కాంట్రాక్టర్ తో పాటు అతనికి సహకరించిన అధికారులపై చీఫ్ సెక్రటరీ తక్షణమే చర్యలకు ఆదేశించాలని, వేడుకుంటున్నారు సబ్ డివిజన్ రైతులు.


