మొక్కజొన్న  నిలువ రవాణాకు వెసులుబాటు కల్పించాలి.

వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ సహాయక శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్.

మొక్కజొన్న  నిలువ రవాణాకు వెసులుబాటు కల్పించాలి.

వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ సహాయక శాఖ కార్యదర్శి సురేందర్ మోహన్.

భూపాలపల్లి మహాదేవపూర్ మీ 11( నిజం న్యూస్)

జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు మరియు విలువ రవాణా అంశాలపై వెసులుబాటు కల్పించాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ సహాయక కార్యదర్శి సురేందర్ మోహన్, అన్నారు. ఐ డి ఓ సి కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు మరియు నిల్వతో పాటు హమాలీ చార్జీ పెంపు లాంటి సమస్యలను తలెత్తకుండా చూడాలని అన్నారు. అలాగే గన్ని బ్యాగుల లభ్యత మరియు స్టోరోజీ స్పేస్ రవాణా సౌకర్యం రైతులు సొంత గన్ని బ్యాగులు తీసుకువచ్చిన సందర్భంలో ఎంట్రీ విధానం తదితర అంశాల పై దిశా నిర్దేశాలు చేశారు. మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని కార్యదర్శి అధికారులకు ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ అధికారి నోడల్ అధికారి తో పాటు తదితర శాఖల అధికారులు ఉన్నారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button